LeEco అనే పేరుతో చైనీస్ కంపెని le 1S మొబైల్ తో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసినదే. ఇప్పుడు కంపెని ఇండియాలో ఫిజికల్ స్టోర్స్ ను తెరవనుంది.
ఆల్రెడీ ఇందుకు సంబంధించి Foreign investment ప్రొమోషన్ బ్రాండ్ (FIPB) కు అప్లికేషన్ ఫైల్ చేసింది LeEco. కేవలం కంపెని మొబైల్స్ మాత్రమే సేల్ అవుతాయి ఈ స్టోర్స్ లో.
స్టోర్స్ లో బ్రాండ్ యొక్క మొబైల్స్ తో పాటు టీవీ, బ్లూ టూత్, VR హెడ్ సెట్స్ అండ్ పవర్ బ్యాంక్స్ కూడా ఉండనున్నాయని తెలిపారు కంపెని COO.
make in india లో జాయిన్ అవ్వాలని ఉంది, సో ఇండియాలో డివైజెస్ ను తయారు చేసే యోచనలో కూడా ఉన్నట్లు వెల్లడించింది కంపెని. బెంగలూరు లో 2016 చివరికల్లా 1000 మందికి జాబ్స్ ఇస్తూ R&D యూనిట్ ను కూడా నడపనుంది.
LeEco Le 1S యొక్క కంప్లీట్ ఓవర్ వ్యూ ను తెలుగులో క్రింది వీడియో లో చూడగలరు..