11,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో Le 2 అండ్ Le Max 2 లాంచ్

Updated on 08-Jun-2016

LeEco ఈ రోజు సెకెండ్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్, Le 2 మరియు Le Max 2 మోడల్స్ ను లాంచ్ చేసింది ఇండియాలో. ఇవి ఆల్రెడీ చైనాలో ఏప్రిల్ లో రిలీజ్ అయ్యాయి.

Le 2 ప్రైస్ – 11,999 రూ. Le Max 2 ప్రైస్ – 22,999 రూ(4GB ర్యామ్ – 32GB స్టోరేజ్), Le Max – 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ – 29,999 రూ.

Le 2 స్పెసిఫికేషన్స్ – 5.5 in FHD bezel less డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 1.8GHz 652 ప్రొసెసర్, 3GB ర్యామ్, 16MP రేర్ కెమెరా with డ్యూయల్ tone ఫ్లాష్, 8MP ఫ్రంట్ కెమెరా, 32GB స్టోరేజ్, SD card సపోర్ట్ లేదు.  3000mah బ్యాటరీ.

Le max 2 స్పెసిఫికేషన్స్ – 5.7QHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 2.15GHz SoC, 21MP రేర్ OIS కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3100 mah బ్యాటరీ. క్విక్ చార్జింగ్ 2.0.

 Le Max 2 ఫోన్ LeMall.com మరియు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. 1,990 రూ లకు USB టైప్ C పోర్ట్ లో ఫిట్ అయ్యే హెడ్ ఫాన్స్ కూడా రిలీజ్ అయ్యాయి.

జూన్ 20 నుండి రిజిస్ట్రేషన్స్ మొదలు. జూన్ 28 న Le Max 2 మొదటి ఫ్లాష్ సేల్స్ ప్రారంభం. Le 2 డేట్ త్వరలోనే వెల్లడిస్తుంది. 

రెండో ఫోనుల్లో కామన్ గా ఉన్నవి..

  • మెటల్ build
  • 4G LTE అండ్ VoLTE
  • USB టైప్ C పోర్ట్(బాక్స్ లో చార్జర్ ఉంటుంది.)
  • USB టైప్ C ఆడియో పోర్ట్. అంటే నార్మల్ ఫోనుల్లో ఉండే 3.5mm ఆడియో జాక్ ఉండదు రెండింటికీ. కానీ నార్మల్ ఇయర్ ఫోన్స్ కు కనెక్ట్ చేసుకునే connector వస్తుంది బాక్స్ లో. కొత్త ఆడియో పోర్ట్ లో డిజిటల్ Lossless ఆడియో ఉంటుంది అని చెబుతుంది. (ఈ పోర్ట్ కు ఫిట్ అయ్యే ఇయర్ ఫోన్స్ ను అదనంగా కొనాలి)
  • ఫింగర్ ప్రింట్ స్కానర్
  • ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 layered EUI 5.6
  • one ఇయర్ LeEco కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :