ఇక రిలయన్స్ Jio Welcome ఆఫర్ కు LeEco ఫోన్స్ సపోర్ట్
LeEco కంపెని రిలయన్స్ Jio తో పార్టనర్ షిప్ అయ్యింది. ఈ డీల్ ప్రకారం ఇక నుండి LeEco ఫోన్స్ వాడుతున్న వారు Jio welcome ఆఫర్ ను ఆస్వాదించవచ్చు.
అన్ని ఫోనులపై Jio సపోర్ట్ చేస్తుంది అన్నారు కదా?
అవును అన్ని 4G ఫోనులపై సపోర్ట్ చేస్తుంది టెక్నికల్ గా. కాని కోడ్ జెనరేటింగ్ మాత్రం అన్ని ఫోనులపై అవటం లేదు. కేవలం ఇలా ప్రత్యేకంగా పార్టనర్ షిప్ కుదుర్చుకున్నాకే కోడ్ జెనరేటింగ్ అనేది అవుతుంది.
LeEco లో ఏ ఫోనులు సపోర్ట్ ఉన్నాయి?
Le 1s, Le 1s Eco, Le 2, Le Max and Le Max 2 ఫోనులు ఈ ఆఫర్ ను సపోర్ట్ చేయనున్నాయి.
LeEco లో VoLTE ఏ ఫోనుల్లో ఉంది?
Le 2 and Le Max 2 ఫోన్స్ లోనే ఉంది VoLTE. LeEco Le 1s, Le 1s Eco and Le Max మోడల్స్ లో JioJoin యాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవాలి.
అంటే ఇప్పుడు LeEco ఫోనులకు కోడ్ generate కావాలి. Welcome ఆఫర్ కోసం కోడ్ ఏలా generate చేయాలి అనేది క్రింద చూడగలరు..
- ప్లే స్టోర్ నుండి MyJio యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే, install all అని ఉంటుంది పైన.
- దాని పై టాప్ చేస్తే ప్లే స్టోర్ లోకి వెళ్లి Jio యాప్స్ ను చూపిస్తుంది ఫోన్ స్క్రీన్.
- ఇప్పుడు ఒక్కొకటి ఇంస్టాల్ చేయాలి. ఒక యాప్ పూర్తిగా ఇంస్టాల్ అయిపోయాక ప్లే స్టోర్ ఆటోమాటిక్ గా నెక్స్ట్ యాప్ ను ఇంస్టాల్ చేయమని చూపిస్తుంది.
- అన్ని ఇంస్టాల్ చేసిన తరువాత మీకు MyJio యాప్ ఓపెన్ చేస్తే పైన మీ రాష్ట్రం మరియు ఏరియా ఎంటర్ చేయమని రెండు ఆప్షన్స్ వస్తాయి.
- వాటిని ఎంటర్ చేస్తే..మీకు నెక్స్ట్ స్టెప్ లో మీ పేరు, కరెంట్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
- ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ లో మీకు బార్ కోడ్ తో పాటు ఒక నంబర్ కూడా వస్తుంది. ఇదే కోడ్.
- అయితే అందరికీ యాప్స్ ఇంస్టాల్ చేసిన తరువాత రాష్టం మరియు ఏరియా పేరును అడుగుతూ ఆప్షన్స్ రావటం లేదు.
- ఇప్పుడు ఆ కోడ్ మరియు ఆధార్ కార్డ్, ఫోటోస్, పట్టుకొని దగ్గరిలోని స్టోర్ కు వెళితే మీకు వెంటనే సిమ్ మరియు యాక్టివేషన్ రావాలి.