ఇండియాలో LeEco నుండి రెండు అనౌన్సుమెంట్స్: ఒకటి కొత్త స్మార్ట్ ఫోన్ మరొకటి కంటెంట్ membership

ఇండియాలో LeEco నుండి రెండు అనౌన్సుమెంట్స్: ఒకటి కొత్త స్మార్ట్ ఫోన్ మరొకటి కంటెంట్ membership

LeEco ఇండియాలో కొత్తగా రెండు అనౌన్సుమెంట్స్ చేసింది. ఒకటి Le 1S Eco స్మార్ట్ ఫోన్ లాంచ్. రెండవది వీడియో, ఆడియో కంటెంట్ అందించే membership ప్రోగ్రాం.

కంపెని లాంచ్ చేసిన కొత్త ఫోన్ పేరు Le 1S Eco (అవును పేరు లానే ఫోనులోని స్పెక్స్ కూడా ఇంతకుముందు లాంచ్ అయిన Le1S ఫోన్ కు సిమిలర్ గా ఉన్నాయి.)

ఈ మోడల్ మేడ్ ఫర్ ఇండియా లో భాగంగా వస్తుంది. supertainment package పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో LeEco అనౌన్స్ చేసిన కంటెంట్ వన్ ఇయర్ membership తో వస్తుంది.

అయితే మొదటి ఫ్లాష్ సెల్ లో ఈ supertainment package(Le1S Eco ఫోన్ + వన్ ఇయర్ కంటెంట్) 9,999 రూ లకే ఇస్తుంది LeEco. May 12 మధ్యాహ్నం 2.00PM కు మొదటి ఫ్లాష్ సెల్ స్టార్ట్ అవుతుంది.

LeEco కంటెంట్ అందించటానికి Eros Now, YuppTV మరియు Hungama వంటి ఇండియన్ కంటెంట్ సర్వీసెస్ తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.

కంటెంట్ అంటే ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, మూవీస్, ఉంటాయి. కంటెంట్ మెంబర్ షిప్ లో 2000 మూవీస్ ను LeVidi ద్వారా , 100టీవీ చానెల్స్ ను Le Live ద్వారా అండ్ 2.5మిలియన్ మ్యూజిక్ ట్రాక్స్ ను LeEco music ద్వారా పొందుతారు.

25 ఇండియన్ లాంగ్వేజెస్ లో ఉంటుంది LeEco music కంటెంట్. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరిగే 50 కు పైగా live concerts ను అందిస్తుంది. ఈ కంటెంట్ సర్వీసెస్ అన్నీ ప్రస్తుత Le1S అండ్ Le మాక్స్ ఫోనుల్లో కూడా OTA అప్ డేట్ ద్వారా అందుతాయి కాని వాటిని వాడటానికి పే చేయవలసి ఉంటుంది మోస్ట్ probably.

ఆల్రెడీ LeEco ఫోనులు వాడె వారికీ ఎవరికైనా ఈ కంటెంట్ కావాలి అనుకుంటే నెలకు 490 రూ పే చేయాలి. ఇయర్ కు 4,900 రూ పే చేయాలి. వన్ ఇయర్ పేమెంట్ చేసిన వారికీ LeEco నుండి ఫ్యూచర్ లో ఎవరైనా కొత్త ఫోన్ కొంటే దాని ప్రైస్ లో 4000 రూ వరకు తగ్గింపు ఉంటుంది.

కంటెంట్ అంటూ చాలా చెప్పారు కాని ఇంతకీ ఒకే పేరులా ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ "LeEco Le1S Eco" యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పటం లేదేంటి అనుకోకండి..క్రింద చూడండి..

  1. 5.5 in ఫుల్ HD డిస్ప్లే
  2. 1.8GHz మీడియా టెక్ Helio X10 ప్రొసెసర్
  3. 3GB ర్యామ్
  4. 13MP ప్రైమరీ కెమెరా
  5. 5MP ఫ్రంట్ కెమెరా
  6. 3000 mah బ్యాటరీ
  7. 32GB ఇంటర్నెల్ స్టోరేజ్

కంపెని ఫోన్ యొక్క స్పెక్స్ కేవలం ఇవే తెలిపింది ప్రెస్ రిలీజ్ లో. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం గతంలో లాంచ్ అయిన Le 1S స్మార్ట్ ఫోన్ కు మరియు ఇప్పుడు లాంచ్ అయిన Le1S Eco కు స్పెక్స్ వైజ్ గా తేడాలు ఏమీ లేవు, కేవలం ఇండియాలో తయారు అయ్యింది డివైజ్ మరియు అదనంగా కంటెంట్ తో వస్తుంది.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo