షావోమి రెడ్మి ప్రో 2 అధికారిక రెండర్లు లీక్ : ఒక 6.3 అంగుళాల డిస్ప్లే, 3900mAh బ్యాటరీని,TENAA లిస్టింగ్ చూపిస్తోంది

Updated on 07-Jan-2019
HIGHLIGHTS

వైబో లో షావోమి నుండి రెడ్మి విడిపోనుందని ప్రకటించింది. షావోమి నుండి విడిపోయిన తరువాత రెడ్మి విడుదల చేయనున్న మొదటిఫోను, రెడీమి ప్రో 2 కానుంది.

ముఖ్యాంశాలు:

1. Redmi ప్రో 2 ఒక 6.3 అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది

2. ఒక 3900mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది

3. జనవరి 10 న ఈ ఫోన్ ప్రారంభమవుతుంది

ఇటీవలే, జనవరి 10న Xiaomi ఒక Redmi పరికరాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించబడింది. అయినప్పటికీ, ఎటువంటి స్మార్ట్ ఫోన్నీ కంపెనీ లాంచ్ చేయనుందో  తెలియలేదు కానీ, తాజా లీకులు మరియు లిస్టింగ్స్ అన్ని కూడా అది Redmi Pro 2 అని సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్లో గుర్తించబడింది మరియు TENAA లో కూడా ఈ పరికరం జాబితా చేయబడింది. ఈ రెడ్మి ప్రో 2 దాని ప్రధాన బ్రాండ్ అయినా Xiaomi నుండి విడిపోయిన   తర్వాత,  ఒక స్వతంత్ర సంస్థగా Redmi నుండి రానున్న మొదటి పరికరంగా ఉంటుంది.

Xiaomi Redmi Pro 2,  LED ఫ్లాష్ మరియు ఒక వేలిముద్ర సెన్సార్ తో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ నిర్ధారిస్తూ, చైనీస్ సర్టిఫికేషన్ ఏజెన్సీ TENAA పై దర్శనమిచ్చింది. ఈ Redmi ఇప్పుడు Xiaomi నుండి ఒక ప్రత్యేక బ్రాండు అనేవిషయం వాస్తవామేనని ధృవీకరిస్తూ, సాధారణ "Mi" అటెస్టింగుకు బదులుగా, వెనుక ప్యానెల్ దిగువన "రెడ్మి" బ్రాండింగును ప్రింట్ చేసినట్లు  ఈ ఫోన్ చూపిస్తుంది. ముందు, ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నోచ్ తో కనిపిస్తుంది, పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ బటన్లు పరికరం యొక్క కుడి అంచున చూడవచ్చు.

TENAA లిస్టింగ్ కూడా ఈ దివిజులో ప్రశ్నార్ధకముగా వున్నవాటిని వెల్లడించింది. ఇది ఒక 6.3-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఒక 3900 mAh బ్యాటరీ ద్వారా మద్దతునిస్తుందని వెల్లడించింది. ఇవికాకుండా, హార్డ్వేర్ గురించిన ఏ ఇతర సమాచారం వెల్లడించలేదు. కానీ, ఈ రెడ్మి ప్రో 2 ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ద్వారా ఆధారితంకావచ్చు. ఇది సోనీ IMX576 24MP సెల్ఫీ కెమెరా మరియు వెనుకవైపు 48MP + 5MP సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్లను కలిగి ఉంటుంది. ఇది Android పై 9.0 ఆధారంగా, Xiaomi యొక్క MIUI 10 తో రావచ్చు.

పైన పేర్కొన్న విధంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక స్వతంత్ర బ్రాండ్ గా Redmi మారిన తరువాత రానున్న మొదటి పరికరంగా ఉంటుంది. Xiaomiయొక్క CEO అయినటువంటి,  Lei Jun ప్రకారంగా,  దీనివలన ఈ సంస్థ "Mi" బ్రాండ్ మీద మరింత దృష్టి పెట్టడానికి సహాయంచేస్తుంది మరియు మరింత ఆదాయాన్ని అందించడంలో సహాయం చేస్తుంది అని చెప్పింది. ఈ చీలిక తరువాత, Xiaomi దాని కింద మూడు వేర్వేరు బ్రాండ్లు కలిగి ఉంటుంది: బడ్జెట్ ఫోన్ల కోసం Redmi, 'సరసమైన ప్రీమియం' ఫోన్లకు Poco మరియు ప్రీమియం ఫోన్ల కోసం Mi.

Image Courtesy :Android Pure

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :