లీక్ చేయబడిన, నోకియా 9 ప్యూర్ వ్యూ బ్యాక్ కేసు ఈ ఫోనులో 5 కెమేరాలు ఉన్నట్లు చూపిస్తోంది
ఈ లీకైన బ్యాక్ కేసు, ఈ నోకియా 9 PureView కోసం, ఛార్జింగ్, స్పీకర్ గ్రిల్ మరియు ఒక 3.5mm జాక్ వంటి విభిన్న పోర్టుల కోసం పలు ఓపెనింగులు ఉన్నాయి అని ఆరోపించిన . HMD గ్లోబల్ దీనిని డిసెంబర్ 5 న దుబాయ్లో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో స్మార్ట్ఫోన్ను ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఆరోపిత నోకియా 9 PureView స్మార్ట్ ఫోను యొక్క లీకైన వెనుక కవర్ చిత్రాలు ఈ స్మార్ట్ ఫోను గురించి చాలా సమాచారాన్ని వెల్లడించాయి. ఈ కవర్ యొక్క కెమెరా మాడ్యూల్ కోసం ఏడు ఓపెనింగులను కలిగిఉంది, వాటిలో ఐదింటిని లెన్సుల కోసం, ఫ్లాష్ కోసం ఒకటి మరియు ఆరోపించిన IR ఫోకసింగ్ ఉపకరణం కోసం ఒక వున్నాయి. మైక్రోఫోన్ను సూచించే కెమెరా ఓపెనింగ్లో ఒక గుబ్బ కూడా ఉంది. ఈ రక్షణాత్మక కేసులో వివిధ పోర్టులకు ఓపెనింగ్స్ ఉన్నాయి మరియు దాని యొక్క రూపాన్ని కలిగి ఉంది, ఈ నోకియా 9 PureView చాలా పోర్ట్సు కలిగిఉంటుంది.
దిగువ అంచులో, ఈ కేసు మూడు ఓపెనింగ్లను చూపిస్తుంది: అందులో ఒకటి ఛార్జింగ్ కోసం కావచ్చు, మరొకటి స్పీకర్ కోసం కావచ్చు మరియు మూడవది ఒక 3.5mm జాక్ కోసం ఇవ్వబడింది. కానీ ఈ ఓపెనింగ్ ఏమిటో పూర్తిగా మనం నిర్ధారించలేము ఎందుకంటే పైభాగంలో కూడా ఇలాంటి ఓపెనింగ్ కూడా ఉంది. కేసు కూడా పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ యొక్క ఆరోపించిన స్థానం చూపిస్తుంది. ముందు నుండి చూసినప్పుడు, అన్ని బటన్లూ కూడా కుడి అంచున వుంటాయి. వేలిముద్ర సెన్సారు కోసం ఓపెనింగ్ లేదు, ఇది పరికరంలోని ప్రదర్శనలో వేలిముద్ర సెన్సార్ లేదా ముఖం అన్లాక్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది కాబోలు.
దీని విడుదల విషయానికి వచ్చినప్పుడు, MWC లో ఈ పరికరాన్ని ఆవిష్కరిస్తారని కొందరి నివేదికలు ప్రకటించాయి, మరికొంతమంది డిసెంబర్ 5 న దుబాయిలో జరగనున్న కార్యక్రమంలో సంస్థ, ఈ పరికరాన్ని ప్రారంభించవచ్చని చెబుతున్నారు. ఈ నోకియా 8.1 మరియు నోకియా 2.1 వేర్వేరు ఇతర పరికరాలతో పాటు ఈ సార్ట్ ఫోనును కూడా ప్రారంభించవచ్చుఅని కొందరు అంచనావేస్తున్నారు. HMD గ్లోబల్ యొక్క చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్, Juho Sarvikas ఈ కార్యక్రమంలో మూడు కొత్త ఫోన్లను ఆవిష్కరించటానికి, ఈ కార్యక్రమం కోసం తేదీని "Save" చేసుకోండి అని కూడా తెలిపారు .
నోకియా 9 ప్యూర్ వ్యూ యొక్క ముందస్తు అంచనా ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ గురించిన పూర్తిగా అన్ని విషయాలు గురించి తెలియకపోయినప్పటికీ, ఈ పరికరం మీద వచ్చిన కొన్ని లీకులు ద్వారా, ఈ ఫోన్ భారీ ఉపయోగం కోసం ఒక 4150 mAH సామర్ధ్యంగల మరియు తొలగించడానికి వీలుండేటువంటి బ్యాటరీ వంటి కొన్ని ముఖ్యమైన సమాచారం తెసులుస్తోంది. స్మార్ట్ఫోన్ ఒక 5.9 అంగుళాల, QHD రిజల్యూషన్ 3D గ్లాస్ OLED డిస్ప్లేతో రావచ్చని ఏప్రిల్ నెలలో, ఒక నివేదిక పేర్కొంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది క్కోడా చెప్పింది. ఆప్టిక్స్ విషయంలో, ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ ఒక 41MP ప్రాధమిక వైడ్-యాంగిల్ కెమెరా, 20MP సెకండరీ టెలిఫోటో లెన్స్ మరియు ZEISS ఆప్టిక్స్తో 9.7MP మోనోక్రోమ్ కెమెరా వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇతర రెండు ఆరోపించిన కెమెరాల గురించి సమాచారం లేదు.
ఇమేజి సోర్సు : nokiapoweruser (స్లాష్ లీక్స్ ద్వారా)