మైక్రోసాఫ్ట్ కొత్త విండోస్ 10 లాంచ్ చేసిన తరువాత రాబోయే అప్ కమింగ్ మోడల్, లుమియా 950 మరియు 950 XL మోడల్స్ రెండూ మోస్ట్ awaiting మొబైల్స్ గా మారాయి.
ఇప్పుడు తాజాగా వీటి ఇమేజెస్ అని చెబుతూ ఒక చైనీస్ ఫోరం లో ప్రత్యేక్షమయ్యాయి కొని ఇమేజెస్. ఫోటో చుస్తే బ్లాక్ కలర్ 950 XL మోడల్ కు usb టైప్ c పోర్ట్ ఉంది.
మైక్రోసాఫ్ట్ నుండి రానున్న ఈ రెండు మోడల్స్ సెప్టెంబర్ లో న్యూ యార్క్ లో జరగనున్న ఈవెంట్ లో లాంచ్ అవుతాయి. 950 XL మోడల్ లో విండోస్ 10 insider preview ను రన్ అవుతుంది. మరియు దీనికి 3GB ర్యామ్ ఉన్నట్లు స్పష్టమవుతుంది.
అసలు లుమియా 950 మోడల్స్ ఎందుకు అంత awaiting మోడల్స్ అయ్యాయి..?
ఇందుకు కారణం వాటి రూమర్డ్ స్పెక్స్ – లుమియా 950 XL – 5.7 in WQHD OLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 SoC 64 బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 20MP ప్యూర్ వ్యూ కెమేరా ట్రిపుల్ LED ఫ్లాష్, 5MP వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమేరా, 3300 mah బ్యాటరీ, Qi వైర్లెస్ చార్జింగ్, Iris infrared స్కానర్ ఫర్ విండోస్ Hello.
ఇవే స్పెక్స్ లుమియా 950 కూడా ఉంటాయి కాని ఫోన్ డిస్ప్లే పరంగా కాంపాక్ట్ ఫోన్ వేరియంట్ తో 3Gb ర్యామ్ తో వస్తుంది 950. దీనిలో స్నాప్ డ్రాగన్ 808 64 బిట్ Hexa కోర్ మరియు 3000 mah బ్యాటరీ ఉంటాయి.
ఇమేజ్ ఆధారం : WPXAP Forum