షియోమీ మీ 8ఎక్స్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడిన చిత్రాల లీక్ అయినట్లు వెల్లడి

Updated on 07-Aug-2018
HIGHLIGHTS

షియోమీ మీ 8ఎక్స్ యొక్క మూడు చిత్రాల సెట్ ని చైనీస్ సోషల్ మీడియా అయిన వైబో తన ప్లాట్ఫాం లో షేర్ చేసింది, ఇందులో బ్యాక్ ప్యానెల్లో సెన్సార్ లేకుండా Mi 8-వంటి స్మార్ట్ ఫోన్ ని చూపించిన వైబో.

షియోమీ మీ 8, మీ 8 ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ మరియు మీ 8 ఎస్ఈ  స్మార్ట్ ఫోన్లను ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయబడ్డాయి .ఈ మీ 8 ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో  డిస్ప్లే లోనే వేలిముద్ర సెన్సార్ ఉంది మరియు మీ 8 ఎస్ఈ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 శక్తిని కలిగి ఉంది. ఆ కాలంలో, XDA డెవలపర్లు 'సిరియస్' మరియు 'కమెట్' అనే కోడ్ నేమ్ తో  రెండు షియోమీ స్మార్ట్ ఫోన్లను 710 SoC చేత శక్తితో పనిచేయ గలవు. 'సిరియస్' స్మార్ట్ ఫోన్ ని మీ 8 ఎస్ఈ గా అధికారికంగా నిర్ణయించారు, అయితే 'కామెట్' అని ఈ స్మార్ట్ ఫోన్ మీద ఏవిధమైన అధికారిక పదం లేదు. షియోమీ తన ఈ వరుసక్రమంలో మరొక ఫోన్ గా, షియోమీ మీ 8ఎక్స్ ని , డిస్ప్లే లో వేలిముద్ర సెన్సార్ , స్నాప్ డ్రాగన్ 710 తో అందించనుందిని ఇంకా ఇది  పుకార్లలో వున్నా 'కామెట్' స్మార్ట్ ఫోన్ కావచ్చు,అని  ఒక లీక్స్టర్ చెప్పుకొచ్చారు.

 తెలుపు మరియు నీలం రంగులలో కనిపిస్తున్న పుకార్లు కలిగినఈ ఫోన్ల  పుకార్ల చిత్రాలను ఈ లీక్స్టర్ పోస్ట్ చేసింది. 8ఎక్స్ ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్లో ఉండవచ్చని ఎందుకు చెప్పబడుతుందంటే  వైబో లో పోస్ట్ చేయబడిన చిత్రాలు వెనుక ప్యానెల్లో ఏవిధమైన వేలిముద్ర స్కానర్ను కలిగి ఉండవు. వెనుకవైపు డ్యూయల్-కెమెరా సెటప్ మాత్రమే ఉంది.

ఈ చిత్రాలను మీడియాలో నివేదించినప్పుడు, షియోమీ  సీఈవో అయిన లీ జున్  యొక్క మరో చిత్రం వీబోలో కనిపించింది. దానిలో ఈ  స్మార్ట్ ఫోన్ యొక్క  రూపకల్పనకు అనుగుణమైన ఒక రహస్య ఫోన్ తో పాటుగా అతను కనిపించాడు  – ఈ ఫోన్  డ్యూయల్ – కెమెరా వ్యవస్థని కలిగివుంది కానీ వేలిముద్ర సెన్సార్ దీనిలో లేదు. అయితే, చిత్రం వచ్చిన ఆ సమయంలో సమయంలో ఈ పుకార్ల కు వూతం ఇచేలా షియోమీ మీ 8ఎక్స్ కి  ఆ ట్రాక్షన్ వచ్చేలా ఫోటోషాప్ చేసి ఉండవచ్చని దేనికి ఎకువ అవకాశం ఉంది. ఈ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ ఒక OLED డిస్ప్లేతో మరియు నోచ్ లేకుండా ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయోతో పనిచేస్తుంది మరియు 3,100 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సంబంధిత నివేదికలో, స్లాష్ లీక్స్ షియోమీ మీ 8ఎక్స్ యొక్క ఆరోపించిన తెలుపు రంగు వేరియంట్ యొక్క ఒక చిత్రాన్ని ముందుగానే షేర్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :