రోజూ చాలా ఫోన్ల విషయాలు లీక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా OnePlus Two Benchmarks కుడా నెట్ లో లీక్ అయ్యాయి. అయితే బాగా పాపులర్ అయిన OnePlus కంపెని తరువాతి మోడల్ , OnePlus Two క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 ప్రాసెసర్ పై నడవనుంది. ఇప్పటివరకు ఈ ప్రాసెసర్ చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. అందుకు కారణం క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 పై నడుస్తున్న ఫోన్ల్ అన్నీ వేడెక్కటమే. గతంలో మొదటి మోడల్ తో అందరి మన్నలను పొందిన OnePlus కంపెని దాని తరువాతి మోడల్ ను స్నాప్డ్రాగెన్ 810 ప్రోసెసర్ తో తయారు చేయటం కొంచెం నిరాశ గా ఉంది.
Geekbench బెంచ్మార్క్ ఇది MSM8994 SoC ద్వారా పనిచేయనుంది అని తెలిపింది. ఈ మోడల్ నంబర్ ద్వారా అది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 అని నిర్ధారణ అయ్యింది. కానీ సాధారణంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 2.5Ghz వరకూ స్పీడ్ ను ఇస్తుంది కాని Geekbench బెంచ్మార్క్ లో అది 1.55Ghz స్పీడ్ వరకూ పనిచేస్తున్నట్టు చూపిస్తుంది.
ఒకసారి Geekbench బెంచ్మార్క్ స్కోర్స్ ను గమనిస్తే అందులో OnePlus Two(మోడల్ నెం A2001) దాదాపు సామ్సంగ్ గేలక్సీ S6 దగ్గరిలో స్కోర్స్ ను ఇస్తుంది. OnePlus Two సింగిల్ కోర్ 1256 మరియు మల్టి కోర్స్ స్కోర్ 4093 ను ఇస్తుంది. సామ్సంగ్ గేలక్సీ S6 సింగిల్ కోర్ స్కోర్ 1250 మరియు మల్టీ కోర్ స్కోర్ 4100 లను ఇస్తుంది. అలాగే లికైన ఇమేజ్ లో OnePlus Two లో OnePlus One మాదిరిగానే 3జిబి ర్యామ్ ను వాడుతున్నట్టు కనిపిస్తుంది. అయితే 64బిట్ ఆర్కిటెక్చరు ను పూర్తిగా వాడేలా 4జిబి ర్యామ్ ను జోడిస్తే బాగుండేది.
OnePlus Two ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ను వాడుతుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, హై MP కౌంట్ కెమేరా మరియు 2K డిస్ప్లే OnePlus Two లో ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. తన ముందు మోడల్ కన్నా ఇది లైట్ వెయిట్ తో రానుంది. OnePlus Two ఈ సంవత్సరం మూడవ క్వాటర్ లో రానుంది.
ఆధారం: Geekbench