digit zero1 awards

Lava Yuva 5G: కొత్త చిప్ సెట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!

Lava Yuva 5G: కొత్త చిప్ సెట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
HIGHLIGHTS

ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది

ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లి గా వుండే అవకాశం ఉంటుంది

ఈరోజు ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు డిజైన్ ను కూడా రివీల్ చేసింది

Lava Yuva 5G: ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. లావా బ్రాండ్ యొక్క బడ్జెట్ సిరీస్ గా చెప్పబడే యువ సిరీస్ నుండి ఈ ఫోన్ ను తీసుకు వస్తోంది. అంటే, ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లి గ వుండే అవకాశం ఉంటుంది. నిన్నటి వరకూ ఈ ఫోన్ లాంచ్ ను మాత్రమే ప్రకటించిన లావా ఈరోజు ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు డిజైన్ ను కూడా రివీల్ చేసింది.

Lava Yuva 5G

లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా యువ 5జి ని మే 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇటావా వివరాలతో ఈరోజు కొత్త టీజర్ ను అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.

Also Read: itel T31 Pro: చవక ధరలో ANC Buds వచ్చేశాయి.!

Lava Yuva 5G

లావా యువ 5జి ఫోన్ యొక్క ప్రోసెసర్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుండి ఈ ఫోన్ ప్రోసెసర్ గురించి టీజర్ అందించింది. ఈ ఫోన్ ను 6nm ఫ్యాబ్రికేషన్ Unisoc T750 5G చిప్ సెట్ తో అందిస్తున్నట్లు లావా తెలిపింది. ఈ ప్రోసెసర్ యొక్క ప్రత్యేకతలను తెలిపే స్కోర్ వివరాలను కూడా లావా బయటపెట్టింది. ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ 360+ AnTuTu స్కోర్ ను తో ఉంటుందని తెలిపింది.

Lava Yuva 5G
Lava Yuva 5G

లావా యువ 5జి ఫోన్ డిజైన్ మరియు స్లీక్ మరియు షైనీ డిజైన్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ ,లో ముందు పంచ్ హోల్ డిస్ప్లే తక్కువ బెజెల్స్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో రావచ్చని టీజర్ ద్వారా అర్ధం అవుతోంది. ఈ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo