Lava Yuva 3: అట్రాక్టివ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!

Lava Yuva 3: అట్రాక్టివ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!
HIGHLIGHTS

లావా యువ 3 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు లాంచ్ చేసింది

7 వేల రూపాయల ఉప బడ్జెట్ లో మంచి ఫీచర్స్ డిజైన్ తో లాంచ్

భారత మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన లావా బడ్జెట్ ఫోన్

Lava Yuva 3: గత కొన్ని రోజులుగా లావా టీజింగ్ చేస్తున్న కొత్త ఫోన్ లావా యువ 3 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 7 వేల రూపాయల ఉప బడ్జెట్ లో మంచి ఫీచర్స్ మరియు ఆకర్షణియమైన డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ మొదలుకొని ఛార్జ్ టెక్ వరకూ అన్ని అల్రౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. భారత మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఈ లావా బడ్జెట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Lava Yuva 3 Price

లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,799 ధరతో విడుదల చేసింది. ఇది 4GB RAM + 64GB / 128GB వేరియంట్ లలో లభిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ అమేజాన్ మరియు లావా అధికారిక వెబ్సైట్ lavamobiles.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: Jio Best Plan: నెలకు కేవలం రూ. 230 ఖర్చుతోనే unlimited 5G లాభాలను అందించే బెస్ట్ ప్లాన్.!

లావా యువ 3 ప్రో ప్రత్యేకతలు

లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను 8.45 mm మందంతో మంచి డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని Punch Hole డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ లావా ఫోన్ UNISOC T606 ఆక్టా కోర్ ప్రోసెసర్, 4GB RAM +4GB వర్చువల్ ర్యామ్ మరియు 64GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో కలిగి వుంది. ఈ ఫోన్ Android 13 OS పీఎం నడుస్తుంది.

Lava Yuva 3 Features

లావా యువ 3 ప్రో ఫోన్ లో వెనుక 13MP + AI + VGA సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా వుంది. ఇందులో Slow Motion, HDR, Night, Portrait లతో పాటుగా 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా వుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

ఇక ఈ ఫోన్ లో అందించిన అధనపు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, Face Unlock మరియు బ్యాటరీ సేవింగ్ మోడ్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ స్పెక్స్ షీట్ ప్రకారం, 7 వేల రూపాయల ధర పరిధిలో మంచి ఫీచర్స్ కలిగిన అట్రాక్టివ్ డిజైన్ ఫోన్ గా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి రివ్యూ తరువాత మాత్రమే క్లియర్ గా చెప్పే వీలుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo