Lava Yuva 3: అతి చవక ధరలో 18W ఫాస్ట్ ఛార్జ్ మరియు 500mAh బ్యాటరీతో వస్తోంది.!
ఇండియన్ మొబైల్ బ్రాండ్ LAVA మరొక బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది
5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది
Lava Yuva 3 కీలకమైన స్పెక్స్ ను టీజింగ్ ద్వారా తెలిపింది
Lava Yuva 3: ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా మరొక బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే లావా యువ 3 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ ను కూడా ముందుగానే అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ పైన హైప్ ను మరింత పెంచే విధంగా ఈ ఫోన్ రేట్ ను ప్రకటించింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను 7 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
Lava Yuva 3 Price
లావా యువ 3 స్మార్ట్ ఫోన్ ను రూ. 6,799 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేస్తునట్లు కంపెనీ ప్రకటించింది. ఇది 4GB RAM వేరియంట్ ధర అవుతుంది. అయితే, ఈ ఫోన్ కోసం అందించిన టీజింగ్ ద్వారా ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్ మరియు అట్రాక్టివ్ ఫీచర్స్ తో వస్తున్నట్లు క్లియర్ గా చెబుతోంది. ఇలా చెప్పడానికి తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ తో టీజింగ్ చేస్తున్న కంపెనీ ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించ లేదు.
Also Read: Jio Big Offer: మూడు నెలల పాటు 14 OTT లు మరియు 18 Extra డేటా అందించే బెస్ట్ ప్లాన్.!
లావా యువ 3 స్పెక్స్
లావా అప్ అకమింగ్ ఫోన్ యువ 3 యొక్క కీలకమైన స్పెక్స్ ను టీజింగ్ ద్వారా తెలిపింది. లావా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో వస్తోంది. ఈ ప్రోసెసర్ 200+ AnTuTu స్కోర్ ను అందించ గలదని మరియు 8GB వరకూ ర్యామ్ ను ఎక్స్ ప్యాండబుల్ చేసే ఫీచర్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ముందుగా, లావా ఈ ఫోన్ డిజన్ మరియు స్టోరేజ్ లను గురించి టీజింగ్ అందించింది. వాటి ప్రకారం, లావా యువ 3 ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కేమెరా సెటప్ తో అందమైన డిజైన్ ను కలిగి ఉన్నట్లు చూడవచ్చు. అలాగే, ఈ ఫోన్ ను 128GB UFS 2.2 ఫాస్ట్ స్టోరేజ్ తో తీసుకు వస్తున్నట్లు కూడా క్లియర్ గా చెబుతోంది.
ఇక కొత్తగా అందించిన ట్వీట్ ద్వారా ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇప్పటి వరకూ అందించిన టీజింగ్ స్పెక్స్ ను బట్టి చూస్తుంటే, 7 వేల రూపాయల ఉప బడ్జెట్ లో మార్కెట్ లో ఉన్న ఫోన్ లకు గట్టి పోటీనిచ్చే ఫోన్ గా యువ 3 ను లాంచ్ చెయ్యడానికి చూస్తున్నట్లు అర్ధమవుతోంది.