Lava Yuva 2 5G: స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!

Lava Yuva 2 5G: స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!
HIGHLIGHTS

Lava Yuva 2 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లావా ఈరోజు విడుదల చేసింది

రూ. 10,000 ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లావా విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ తో లాంచ్ చేసింది

Lava Yuva 2 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లావా ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో లావా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 10,000 ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లావా విడుదల చేసింది. లావా ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఏమిటో చూద్దామా.

Lava Yuva 2 5G: ధర

లావా ఈ స్మార్ట్ ఫోన్ ను (4GB + 128GB) సింగిల్ వేరియంట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 9,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి మీ దగ్గరలోని అన్ని రిటైల్ అవుట్లెట్ లలో లభిస్తుందని లావా తెలిపింది.

Lava Yuva 2 5G: ఫీచర్స్

లావా యువ 2 5జి స్మార్ట్ ఫోన్ ను 6.67 ఇంచ్ పంచ్ హోల్ IPS స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc T760 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

Lava Yuva 2 5G

ఈ లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను సరికొత్త నోటిఫికేషన్ లైట్ తో అందించింది. ఈ ఫోన్ వెనుక కెమెరాలో 50MP + 2MP AI సెన్సార్ లు ఉన్నాయి మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ మరియు బ్యాటరీ సేవ్ మోడ్ ను కలిగి ఉంటుంది.

Also Read: Oppo Reno 13 Pro Series స్టన్నింగ్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

లావా యువ 2 5జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh Li-Polymer బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే, మంచి సౌండ్ కోసం ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo