Lava upcoming: కొత్త ఫోన్ రెండర్ లతో టీజింగ్ చేస్తున్న లావా.!

Lava upcoming: కొత్త ఫోన్ రెండర్ లతో టీజింగ్ చేస్తున్న లావా.!
HIGHLIGHTS

లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి లావా టీజింగ్ మొదలు పెట్టింది

త వారం చివరి నుండే ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది

ఈ ఫోన్ రెండర్ లతో టీజర్ పోస్ట్ ను లావా అధికారిక X అకౌంట్ నుండి షేర్ చేసింది

Lava upcoming: లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి లావా టీజింగ్ మొదలు పెట్టింది. వాస్తవానికి, గత వారం చివరి నుండే ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, ఇప్పటి వరకూ ఈ ఫోన్ ఎలా ఉంటుంది మరియు ఈ ఫోన్ ఫీచర్ లు ఏమిటి అనే విషయాల గురించి చెప్పలేదు. కానీ, ఎట్టకేలకు ఈ ఫోన్ రెండర్ లతో టీజర్ పోస్ట్ ను లావా అధికారిక X అకౌంట్ నుండి షేర్ చేసింది.

Lava upcoming:

లావా అప్ కమింగ్ ఫోన్ గురించి తన x అకౌంట్ నుండి కొత్త టీజర్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉండబోతుందనే ఒక అంచనాను అందించింది. ముందుగా Xrazy హ్యాష్ ట్యాగ్ మరియు X ను హైలెట్ చేస్తూ ఈ ఫోన్ గురించి చెప్పింది. ఇదంతా చూస్తుంటే , ఈ ఫోన్ ను కొత్త సిరీస్ మరియు ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్టు అనిపిస్తోంది.

ఇక కొత్తగా షేర్ చేసిన ట్వీట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ పైన ఒక ఐడియా ఇచ్చింది. ఈ ట్వీట్ లో అందించిన రెండర్ ద్వారా ఈ అప్ కమింగ్ లావా ఫోన్ చాలా సన్నని స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో కర్వ్డ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

Also Read: Vivo T3 Lite స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో Sony AI కెమెరాతో వచ్చింది.!

ప్రస్తుతానికి ఈ ఫోన్ లాంచ్ డేట్ లేదా ఇతర వివరాలు కంపెనీ అందించలేదు. ఈ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది. ఇప్పటికే చాలా బడ్జెట్ 5G ఫోన్ లను అందించిన దేశీయ బ్రాండ్ లావా ఈసారి ఎటువంటి ఫీచర్ లతో ఈ ఫోన్ ను విడుదల చేస్తుందో చూడాలి.

Lava upcoming Mobile
Lava upcoming Mobile

లావా బడ్జెట్ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ లావా అగ్ని 2 ఇప్పటికి కూడా అత్యంత సరసమైన బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే 5జి ఫోన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం రూ. 16,999 రూపాయలకు లభిస్తోంది. నెక్స్ట్ కూడా కర్వ్డ్ ఫోన్ నే తీసుకువస్తోంది కాబట్టి, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్లు మరియు ధరతో ఉంటుందో చూడాలి.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo