Lava Strom 5G: ఫాస్ట్ ప్రోసెసర్ మరియు బిగ్ ర్యామ్ తో వస్తోంది.!
లావా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది
Lava Strom 5G పేరుతో ప్రకటించిన లావా
డిసెంబర్ 21న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది
ఇండియన్ మొబైల్ కంపెనీ లావా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. Lava Strom 5G పేరుతో ప్రకటించిన లావా కొత్త స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 21వ తేదీన లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లలతో టీజర్ ను అందించింది లావా. ఈ టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ డిజైన్, ప్రోసెసర్, ర్యామ్ మరియు స్టోరేజ్ వివరాలు బయట పెట్టింది. లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ తో మార్కెట్ లో మంచి ఆధరణ అందుకున్న ఈ ఇండియన్ మొబైల్ బ్రాండ్ అప్ కమింగ్ ఫోన్ పైన ఒక లుక్కేయండి.
Lava Strom 5G Launch
లావా స్ట్రోమ్ 5జి స్మార్ట్ ఫోన్ ను 2023 డిసెంబర్ 21న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. లావా స్ట్రోమ్ 5జి ని అమేజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పైన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ప్రత్యేకంగా సేల్ అవుతుందని మనం అర్ధం చేసుకోవచ్చు.
Also Read : HONOR 90 5G పైన రూ.3,000 రూపాయల బిగ్ ఆఫర్.!
లావా స్ట్రోమ్ 5జి టీజ్డ్ స్పెక్స్
లావా స్ట్రోమ్ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రోసెసర్ మరియు ర్యామ్ వివరాలను కంపెనీ బయట పెట్టింది. అమేజాన్ నుండి అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ వివరాలను అందించింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesity 6080 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు లావా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 8GB బిగ్ RAM మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యం ఫీచర్ తో టోటల్ 16GB వరకూ ర్యామ్ సపోర్ట్ లభిస్తుందని పేర్కొంది.
అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB హెవీ స్టోరేజ్ ను కూడా ఆఫర్ చేస్తున్నట్లు లావా కన్ఫర్మ్ చేసింది. అయితే, స్టార్టింట్ వేరియంట్, లేదా హైఎండ్ వేరియంట్ లేదా సింగిల్ వేరియంట్ అవుతుందో తెలియ పరచలేదు. ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక సెపరేట్ బంప్స్ తో కొత్తగా కనిపిస్తున్న కెమేరా డిజైన్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమేరా మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ రౌండ్ కార్నర్స్ తో బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది.
ట్విట్టర్ ద్వారా అందించిన స్ట్రోమ్ 5జి టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో పంచ్ హోల్ డిజైన్ మరియు సన్నని అంచులు కలిగిన డిస్ప్లే ఉన్నట్లు అర్ధమవుతుంది. ఈ ఫోన్ అడుగున Type-C ఛార్జ్ పోర్ట్, 3.5mm జాక్ పోర్ట్ మరియు స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్లను వెల్లడించే అవకాశం ఉండవచ్చు. ప్రసుత టీజ్డ్ స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో కాంపిటీటివ్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.