Lava O2 స్మార్ట్ ఫోన్ రేపు భారత్ మార్కెట్ లో లాంఛ్ అవుతుంది. ఈ ఫోన్ ను గత సంవత్సరం అందించిన లావా ఓ1 యొక్క తరువాతి తరం ఫోన్ గా తీసుకు వస్తోంది. సరసమైన బడ్జెట్ సిరీస్ గా ఈ లావా O Sires నిలుస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కూడా కంపెనీ సరసమైన ధరలోనే లాంఛ్ చేస్తుందని దీని అర్ధం. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లుక్స్ తో పాటుగా స్పెక్స్ మరియు ఫీచర్స్ మాత్రం ప్రీమియం ఫోన్ తలిపిస్తున్నాయి. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క చాలా స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ఇప్పటికే టీజింగ్ ద్వారా బయట పెట్టేసింది.
లావా ఓ2 ఫోన్ మార్చి 22వ తేదీ, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్ లో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంఛ్ తరువాత అమేజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Infinix Note 40 Pro 5G: వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ టెక్ తో వస్తోంది.!
ఈ ఫోన్ ను విడుదల చేయడానికంటే ముందే ఈ ఫోన్ యొక్క చాలా ఫీచర్స్ ను లావా బయట పెట్టింది. అందులో, ఈ ఫోన్ డిస్ప్లే, కెమేరా, ర్యామ్ మరియు బ్యాటరీ టెక్ వంటి కీలకమైన వివరాలు ఉన్నాయి.
లావా ఈ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ HD+ పంచ్ హోల్ డిస్ప్లే తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ను Unisoc T616 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ RAM మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ తో కలిపి మొత్తం 16 GB వరకు ర్యామ్ అందుతుందని తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB (UFS 2.2) ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ ఇంపీరియల్ గ్రీన్ మెజెస్టిక్ పర్పల్ మరియు రాయల్ గోల్డ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో ఉన్నట్లు కూడా లావా కన్ఫర్మ్ చేసింది.