Lava O2 ఫోన్ 16GB మరియు 128 GB స్టోరేజ్ తో రేపు లాంఛ్ అవుతోంది.!
Lava O2 స్మార్ట్ ఫోన్ రేపు భారత్ మార్కెట్ లో లాంఛ్ అవుతుంది
ఈ అప్ కమింగ్ ఫోన్ లుక్స్ తో పాటుగా స్పెక్స్ మరియు ఫీచర్స్ మాత్రం ప్రీమియం ఫోన్ తలిపిస్తున్నాయి
Lava O2 ఫీచర్స్ ను ఇప్పటికే టీజింగ్ ద్వారా బయట పెట్టేసింది.
Lava O2 స్మార్ట్ ఫోన్ రేపు భారత్ మార్కెట్ లో లాంఛ్ అవుతుంది. ఈ ఫోన్ ను గత సంవత్సరం అందించిన లావా ఓ1 యొక్క తరువాతి తరం ఫోన్ గా తీసుకు వస్తోంది. సరసమైన బడ్జెట్ సిరీస్ గా ఈ లావా O Sires నిలుస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కూడా కంపెనీ సరసమైన ధరలోనే లాంఛ్ చేస్తుందని దీని అర్ధం. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లుక్స్ తో పాటుగా స్పెక్స్ మరియు ఫీచర్స్ మాత్రం ప్రీమియం ఫోన్ తలిపిస్తున్నాయి. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క చాలా స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ఇప్పటికే టీజింగ్ ద్వారా బయట పెట్టేసింది.
Lava O2 Launch
లావా ఓ2 ఫోన్ మార్చి 22వ తేదీ, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్ లో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంఛ్ తరువాత అమేజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Infinix Note 40 Pro 5G: వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ టెక్ తో వస్తోంది.!
Lava O2 ఫీచర్స్
ఈ ఫోన్ ను విడుదల చేయడానికంటే ముందే ఈ ఫోన్ యొక్క చాలా ఫీచర్స్ ను లావా బయట పెట్టింది. అందులో, ఈ ఫోన్ డిస్ప్లే, కెమేరా, ర్యామ్ మరియు బ్యాటరీ టెక్ వంటి కీలకమైన వివరాలు ఉన్నాయి.
లావా ఈ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ HD+ పంచ్ హోల్ డిస్ప్లే తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ను Unisoc T616 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ RAM మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ తో కలిపి మొత్తం 16 GB వరకు ర్యామ్ అందుతుందని తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB (UFS 2.2) ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ ఇంపీరియల్ గ్రీన్ మెజెస్టిక్ పర్పల్ మరియు రాయల్ గోల్డ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో ఉన్నట్లు కూడా లావా కన్ఫర్మ్ చేసింది.