Flair సిరిస్ లో Flair P1 పెరుతో లావా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ ఫోన్ ధర 3,399 రూ. సుత్తి లేకుండా సూటిగా దీని స్పెసిఫికేషన్స్ కు వెళ్దాం.
డ్యూయల్ సిమ్, 4in WVGA TFT 480×800 రిసల్యుషణ్ డిస్ప్లే, 1GHz సింగల్ కోర్ ప్రాసెసర్, 256 MB ర్యామ్(చాలా తక్కువ), Mali 400 గ్రాఫిక్స్ ఇంజిన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 2జిబి ఇంటర్నెల్ మెమరీ, 32 జిబి అదనపు మెమరి స్టోరేజ్ సపోర్ట్, 2MP బ్యాక్ కెమేరా, LED ఫ్లాష్, VGA ఫ్రంట్ కెమేరా లావా Flair P1 సొంతం.
స్పెసిఫికేషన్స్ చుస్తే ఇది చాలా నార్మల్ ఫోన్ అని ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. దీనిలో వాడిన 256 MB ర్యామ్ మల్టి టాస్కింగ్ అవసరాలు పక్కన పెడితే, ఇప్పుడున్న పెద్ద పెద్ద ఆప్స్ ను లోడ్ చేసేందుకే ఇబ్బంది పడుతుంది ఏమో. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 3జి ఆప్షన్ ను ఇచ్చింది లావా. 1400mah బ్యాటరీ ఇందులో వాడారు.
అయితే లావా Flair P1 కేవలం బేసిక్ స్మార్ట్ అవసరాలను వాడుకునే మార్కెట్ సెగ్మెంట్ కోసం టార్గెట్ చేసిన మోడల్ అని స్పష్టంగా అర్థమవుతుంది. లావా ఒక వారం కిందటే Iris 100 Lite పేరుతో ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ పై నడిచే ఫోన్ ను అనౌన్స్ చేసింది. ఎంత తక్కువ బడ్జెట్ అయినప్పటికీ మరీ అవుట్ డేటెడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను వాడటం వెనుక లావా ఉద్దేశాలు ఏంటో అర్థం కావటం లేదు. దీంట్లో 512MB ఇంటర్నెల్ స్టోరేజి ఉంది, 3జి కనెక్టివిటి లేదు. ధర 3,049/- రూ. కాని Flair P1 ను అదనంగా 350 రూ వేరియేషన్ తో దించుతున్నప్పుడు లావా ఊహించిన టార్గెట్ యూజర్స్ Flair P1 నే తీసుకుంటారు.