Lava Bold 5G: 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో 5G ఫోన్ లాంచ్ చేసిన లావా.!

Lava Bold 5G: 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో 5G ఫోన్ లాంచ్ చేసిన లావా.!
HIGHLIGHTS

10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో Lava 5G ఫోన్ లాంచ్ చేసింది

లావా మరింత ఎక్కువ కాంపిటీషన్ ఈ ఫోన్ తో తెచ్చిపెట్టింది

ఈ ధరలో 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగిన మొదటి ఫోన్

Lava Bold 5G: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో ఫోన్ లాంచ్. ఈ ఫోన్ డిస్ప్లే మొదలు కొని కెమెరా వరకూ అన్ని కూడా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ధర మాత్రం చాలా తక్కువ అందించింది. ఇప్పటికే మార్కెట్లో భారీ కాంపిటీషన్ నడుస్తుండగా, ఇప్పుడు లావా మరింత ఎక్కువ కాంపిటీషన్ ఈ ఫోన్ తో తెచ్చిపెట్టింది. మరి లావా తెచ్చిన ఈ సూపర్ ఫోన్ విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Lava Bold 5G: ధర

లావా బోల్డ్ 5జి స్మార్ట్ ఫోన్ ను చాలా సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో లావా విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 10,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ధర అన్ని ఆఫర్స్ కలుపుకొని ఉంటుంది. ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంట నుంచి ఈ ఫోన్ సేల్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Also Read: అందరికీ అందుబాటులోకి వచ్చిన Chat GPT ఇమేజ్ జెనరేషన్ ఫీచర్: Ghibli-style ఇమేజ్ ఇలా క్రియేట్ చేసుకోండి.!

Lava Bold 5G: ఫీచర్స్

లావా బోల్డ్ 5జి స్మార్ట్ ఫోన్ ఈ ధరలో 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ధరలో ఈ ఫీచర్ కలిగిన ఏకైక ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB ర్యామ్, 6GB ర్యామ్ మరియు 8GB ర్యామ్ జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటాయి. ఇందులో ఎంతైతే ఫిజికల్ ర్యామ్ అందిస్తుందో, అంతే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. అంటే, 4GB + 4GB, 6GB + 6GB మరియు 8GB + 8GB ర్యామ్ సపోర్ట్ అందిస్తుంది.

Lava Bold 5G

ఈ ఫోన్ కెమెరా పరంగా, ఈ ఫోన్ 64MP Sony మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ లావా కొత్త ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ AGC గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సఫైర్ బ్లూ కలర్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo