Lava Blaze X స్మార్ట్ ఫోన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకూ బ్లేజ్ సిరీస్ నుండి బడ్జెట్ ఫీచర్ లతో బడ్జెట్ ఫోన్ లను మాత్రమే విడుదల చేసిన లావా, ఇప్పుడు కర్వుడ్ డిస్ప్లే మరియు స్టన్నింగ్ డిజైన్ తో కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 64MP డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.
లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ కంటే ముందే ఈ ఫోన్ ఫీచర్లను బయటపెడుతోంది. ముందుగా ఈ ఫోన్ డిజైన్ మాత్రమే వివరించేలా టీజర్ ఇమేజ్ లను అందించిన లావా, ఇప్పుడు కీలకమైన ఫీచర్లతో వివరాలు బయటపెడుతోంది.
ఈ ఫోన్ లో వెనుక 64MP డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కొత్త టీజర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ పెద్ద రౌండ్ బంప్ లో చూడచక్కగా కనిపిస్తోంది. ఈ కెమెరాకి జతగా LED ఫ్లాష్ లైట్ కూడా వుంది. ఈ లావా ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కనిపిస్తోంది మరియు కర్వుడ్ డిస్ప్లేను కలిగి వుంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ లుక్స్ తో కనిపిస్తుంది.
Also Read: బ్లూ బర్డ్ Twitter కి పోటీగా తెచ్చిన ఇండియా యొక్క ఎల్లో బర్ద్ Koo గుడ్ బాయ్.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో వస్తుంది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసుకొని ఈ సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను అందించిన లావా ఈ ఫోన్ రేటును ఎలా ఉంచుతుందో చూడాలి. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ బయటకు వస్తే ఈ ఫోన్ రేటు అంచనా వేసే వీలుంటుంది.
అయితే, ఈ అప్ కమింగ్ 5జి ఫోన్ ఇండియాలో అతి చవక ధరలో లభించే కర్వుడ్ డిస్ప్లే 5జి ఫోన్ గా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు గొప్పలు ఈ ఫోన్ గురించి గొప్పలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజం అయితే, బడ్జెట్ యూజర్ చేతిలో కూడా కర్వుడ్ డిస్ప్లే 5జి ఫోన్ ను పెట్టిన ఘనత లావా కంపెనీకి దక్కుతుంది.