Lava Blaze X: భారతీయ మొబైల్ బ్రాండ్ లావా కొత్త స్మార్ట్ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 64MP Sony కెమెరా అద్భుతమైన డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ కర్వుడ్ డిస్ప్లే మరియు కర్వుడ్ బ్యాక్ ప్యానల్ డిజైన్ తో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ వివరాలు మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
లావా బ్లేజ్ X స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియా లో విడుదల అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లావా తీసుకు వస్తోంది.
లావా ఈ ఫోన్ ను అందమైన మూన్ స్టోన్ మాట్టే డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కర్వ్డ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప కలర్స్ అందించగల కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను టైటానియం గ్రే మరియు స్టార్ లైట్ పర్పల్ రెండు కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో వెనుక అందమైన రౌండ్ కెమెరా బంప్ వుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు LED ఫ్లాష్ లైట్ ఉన్నాయి. ఈ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లో 64MP Sony ప్రధాన కెమెరా ఉన్నట్లు లావా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ 8GB + 8GB ర్యామ్ ఫీచర్ తో వస్తుందని కూడా కంపెనీ తెలిపింది.
Also Read: CMF Watch Pro 2: మీ స్మార్ట్ వాచ్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోండి అనే రీతిలో వచ్చింది.!
కంపెనీ అందించిన వివరాలు అలా ఉంచితే, ఈ ఫోన్ అంచనా ఫీచర్లు కూడా ఊహిస్తున్నారు. ఈ ఫోన్ 6.7 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లే తో వస్తుందని ఊహిస్తున్నారు. ఈ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న 5000mAh బిగ్ బ్యాటరీని మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, డ్యూయల్ స్పీకర్లు మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉండవచ్చు. అయితే, ఇవన్నీ కూడా అంచనా ఫీచర్లు మాత్రమే సుమ. రేపు ఈ ఫోన్ పూర్తి వివరాలు బయటకు వస్తాయి.