Lava Blaze X: చవక ధరలో 3D Curved AMOLED స్క్రీన్, 64MP Sony కెమెరాతో వచ్చింది.!

Lava Blaze X: చవక ధరలో 3D Curved AMOLED స్క్రీన్, 64MP Sony కెమెరాతో వచ్చింది.!
HIGHLIGHTS

లావా కొత్త స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్ 3 ఎక్స్ ఈరోజు విడుదలయ్యింది

Lava Blaze X చవక ధరలో 3D Curved AMOLED స్క్రీన్ మరియు 64MP Sony కెమెరాతో విడుదల

ఈ రేటులో ఈ ఫీచర్ లతో లభించే ఏకైక కర్వుడ్ డిస్ప్లే ఫోనుగా దీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది

Lava Blaze X: గత కొంత కాలంగా టీజర్లతో మార్కెట్ లో చర్చనీయాంశంగా మారిన లావా కొత్త స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్ 3 ఎక్స్ ఈరోజు విడుదలయ్యింది. ఈ ఫోన్ ను చాలా చవక ధరలో 3D Curved AMOLED స్క్రీన్ మరియు 64MP Sony కెమెరాతో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కొత్త కలర్స్ మరియు బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.

Lava Blaze X: Price

లావా బ్లేజ్ X స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 128GB) ను రూ. 14,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (6GB + 128GB) ను రూ. 15,999 ధరలో, హై ఎండ్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 16,999 ధరలో విడుదల చేసింది.

ఈ రేటులో ఈ ఫీచర్ లతో లభించే ఏకైక కర్వుడ్ డిస్ప్లే ఫోనుగా దీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ జూలై 20వ తేదీ నుంచి Amazon మరియు లావా అధికారిక సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పైన ఆల్ బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 1,000 అధనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంటే, బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 13,999 రూపాయలకే పొందవచ్చు.

Also Read: Moto G85: నమ్మశక్యం కాని ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Lava Blaze X: ఫీచర్లు

లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హై బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6300 తో అందించింది. దీనికి జతగా 4GB/ 6GB/ 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వరకూ అదనపు ర్యామ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 128GB బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Lava Blaze X Features
Lava Blaze X Features

ఈ ఫోన్ లో వెనుక అందంగా కనిపించే పెద్ద రౌండ్ బంప్ లో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 64MP AI Sony మెయిన్ కెమెరా వుంది. ఈ ఫోన్ క్లీన్ Android 14 OS తో నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ 15 కి అప్డేట్ అందుకుంటుందని లావా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo