digit zero1 awards

Lava Blaze x: జూలై 10న వస్తున్న లావా బడ్జెట్ ఫోన్ ఫీచర్లు ఇవే.!

Lava Blaze x: జూలై 10న వస్తున్న లావా బడ్జెట్ ఫోన్ ఫీచర్లు ఇవే.!
HIGHLIGHTS

లావా ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లేజ్ ఎక్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు అనౌన్స్

లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను జూలై 10న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ ఫోన్ పూర్తి డిజైన్ మరియు కీలకమైన ఫీచర్లు కూడా ఈరోజు వెల్లడించింది

Lava Blaze x: లావా ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లేజ్ ఎక్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు అనౌన్స్ చేసింది. లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను జూలై 10న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ పూర్తి డిజైన్ మరియు కీలకమైన ఫీచర్లు కూడా ఈరోజు వెల్లడించింది. ఈ ఫోన్ అద్భుతమైన గ్లాసీ లుక్ డిజైన్ మరియు కర్వుడ్ డిస్ప్లే తో వస్తుంది.

Lava Blaze x:

లావా బ్లేజ్ ఫోన్ లాంచ్ డేట్ కోసం ఈరోజు అందించిన టీజర్ లో ఈ ఫోన్ ఫీచర్లను కూడా అందించింది. లావా యొక్క అధికారిక X అకౌంట్ నుండి ఈ టీజర్ ను అందించింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB అదనపు ర్యామ్ ఫీచర్ కూడా వుంది. అంటే, ఈ లావా అప్ కమింగ్ స్మార్ ఫోన్ టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ తో వస్తుంది.

Lava Blaze x
Lava Blaze x

ఈ ఫోన్ లో 64MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటివరకు లావా ఎన్నడూ అందించని కొత్త కెమెరా బంప్ డిజైన్ ను ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ కర్వుడ్ డిస్ప్లే మరియు వెనుక కర్వుడ్ గ్లాస్ డిజైన్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ ఫ్రెండు కలర్ ఆప్షన్ లలో వస్తున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది.

Also Read: Power Bill: కరెంట్ బిల్ పేమెంట్ పైన RBI ఆంక్షలు.. Online లో ఎలా కట్టాలో తెలుసుకోండి .!  

ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లావా తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో టైపు C ఛార్జ్ సపోర్ట్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి సేల్ అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo