50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్ కానున్న Lava Blaze Pro స్మార్ట్ ఫోన్..!!

Updated on 07-Sep-2022
HIGHLIGHTS

Lava తన అప్ అప్ కమింగ్ ఫోన్ ను ప్రకటించింది

Lava Blaze యొక్క ప్రో వెర్షన్ ను తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది

Lava Blaze Pro స్మార్ట్ ఫోన్ టీజింగ్ ను కూడా లావా మొదలుపెట్టింది

ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ Lava, తన అప్ అప్ కమింగ్ ఫోన్ ను ప్రకటించింది. గత జూలై నెలలో ఎంట్రీ లెవల్ ఫోనుగా తీసుకొచ్చిన Lava Blaze యొక్క ప్రో వెర్షన్ ను తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదే, Lava Blaze Pro స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మరిన్ని అప్గ్రేడ్ లను కలిగి ఉంటుందని లావా పేర్కొంది. కంపెనీ యొక్క అన్గాన్ని షోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుండి కూడా ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజింగ్ ను కూడా లావా మొదలుపెట్టింది. లావా యొక్క ఈ అప్ కమింగ్ ఫోన్ మనం ఏమి ఆశించవచ్చునో చూద్దాం.

లావా బ్లేజ్ ప్రో సెప్టెంబర్ నెలలో ఇండియాలో లాంచ్ కావచ్చని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ ఎటువంటి స్పెక్స్ కలిగి ఉంటుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, మా సోర్స్ యొక్క సౌజన్యంతో కొన్ని స్పెక్స్ ను మేము అందించ కలుగుతున్నాము.

 

https://twitter.com/LavaMobile/status/1567408211082489857?ref_src=twsrc%5Etfw

 

లావా బ్లేజ్ ప్రో 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి వుంటుందని భావిస్తున్నారు. అయితే, లావా బ్లేజ్  లో కూడా ఇదే డిస్ప్లేని కలిగివుంది.  కాబట్టి, లావా బ్లేజ్ ప్రో లో డిస్ప్లే మరింత అప్గ్రేడ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. లావా బ్లేజ్ ప్రో కూడా బ్లేజ్ మాదిరిగానే 5,000mAh బిగ్ బ్యాటరీని 10W ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇక కెమెరా పరంగా ప్రో వెర్షన్ పెద్ద అప్గ్రేడ్ తో వస్తుంది. లావా బ్లేజ్ ప్రోలో 50MP ట్రిపుల్ కెమెరాలు 6x డిజిటల్ జూమ్‌ను అందిస్తాయి, ఇది లావా బ్లేజ్‌లోని 13MP ప్రధాన కెమెరా కంటే భారీ అప్‌గ్రేడ్. లావా బ్లేజ్ ఎంట్రీ లేవాలి ఫోన్ కాబట్టి, హీలియో A22 ప్రాసెసర్ తో వచ్చింది. అయితే, ప్రో వెర్షన్ మాత్రం అప్గ్రేడెడ్ SoC తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, లావా బ్లేజ్ ప్రో భారతదేశంలో దాదాపు రూ.10,000 ధరలో ఉంటుందని అంచనా వేయబడింది. అయితే, అధికారికంగా ప్రకటించబడినప్పుడు మాత్రమే మనం కరక్ట్ రేటును పొందుతాము.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :