LAVA: రూ.8,000 కంటే తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫోన్ తెచ్చింది.!

LAVA: రూ.8,000 కంటే తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫోన్ తెచ్చింది.!
HIGHLIGHTS

లావా కేవలం రూ.8,000 కంటే తక్కువ ధరలో మరొక ఆకర్షణీయమైన ఫోన్ తెచ్చింది

Lava Yuva Pro స్మార్ట్ ఫోన్ 8 వేల బడ్జెట్ లో లాంచ్ చెయ్యబడింది

ఈ ఫోన్ లావా అధికారిక ఇ-స్టోర్ నుండి లభిస్తోంది

భారతీయ మొబైల్ తయారీ సంస్థ LAVA చాలా స్పీడ్ గా తన స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తోంది. ఇటీవల Blaze సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లను ఆవిష్కరించిన లావా కేవలం రూ.8,000 కంటే తక్కువ ధరలో మరొక ఆకర్షణీయమైన ఫోన్ తెచ్చింది. అదే, Lava Yuva Pro స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ 8 వేల బడ్జెట్ లో లాంచ్ చెయ్యబడింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది.

Lava Yuva Pro: ధర

LAVA ఈ లావా యువ ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.7,799 రూపాయల ధరతో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ లావా అధికారిక ఇ-స్టోర్ నుండి లభిస్తోంది.

Lava Yuva Pro: స్పెక్స్

లావా యువ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన IPS డిస్ప్లేని కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ 32GB ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది మరియు మెమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, లావా యువ ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 13MP మెయిన్ కెమెరా వుంది మరియు ఈ కెమెరాతో మీరు HDR, నైట్, పోర్ట్రెయిట్ మరియు టైమ్ లాప్స్ వంటి కెమెరా ఫీచర్‌ లను కూడా పొందుతారు. సెల్ఫీల కోసం, ముందు ఉన్న వాటర్ డ్రాప్ నోచ్ లో 8MP కెమెరా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo