Lava Blaze Duo: ఊహించనంత చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్.!

Lava Blaze Duo: ఊహించనంత చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్.!
HIGHLIGHTS

Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల

చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ తో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది

ఈ లావా కొత్త ఫోన్ సోనీ కెమెరాతో కలిగి ఉంటుంది

Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ ను లావా ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న కంపెనీ ఎట్టకేలకు ఈ ఫోన్ ని ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఊహించనంత చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ తో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Lava Blaze Duo : ప్రైస్

లావా బ్లేజ్ డుయో స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో బేసిక్ (6GB+128) వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరతో మరియు హైఎండ్ (8GB+128) వేరియంట్ ను రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరతో ప్రకటించింది.

ఆఫర్:

ఈ స్మార్ట్ ఫోన్ పై బరి బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో అందుకునే అవకాశం వుంది. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.

Lava Blaze Duo : ఫీచర్స్

లావా బ్లేజ్ డుయో లో రెండు స్క్రీన్స్ ఉంటాయి. ఇందులో 6.67 ఇంచ్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు 1.74 ఇంచ్ AMOLED రియర్ స్క్రీన్ ఉంటాయి. ఈ మెయిన్ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన 3D కర్వుడ్ స్క్రీన్. ఇక రెండవ స్క్రీన్ నోటిఫికేషన్, కెమెరా మరియు మరిన్ని మల్టీ టాస్క్ లకు అనుకూలమైనది.

Lava Blaze Duo Launched

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7025 5G చిప్ సెట్, 8GB LPDDR5 ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 500K+ AnTuTu స్కోర్ తో వేగంగా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Also Read: Jio New Year 2025 Offer: కొత్త సంవత్సరం కోసం కొత్త ఆఫర్ ప్రకటించిన జియో.!

ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 64MP Sony సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో గొప్ప ఫోటోలు మరియు వీడియోలు షూట్ చేయవచ్చని లావా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo