Lava Blaze Duo 5G: బడ్జెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ప్రకటించిన లావా.!
డ్యూయల్ స్క్రీన్ తో ఫస్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా
ఇప్పుడు Lava Blaze Duo 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డ్యూయల్ స్క్రీన్ కలిగిన మొదటి ఫోన్
డ్యూయల్ స్క్రీన్ తో ఫస్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా, ఇప్పుడు Lava Blaze Duo 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను కూడా డ్యూయల్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డ్యూయల్ స్క్రీన్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని కూడా లావా తెలిపింది. వినూత్నమైన ఫోన్ లను మార్కెట్ కి పరిచయం చేస్తూ దూసుకుపోతున్న లావా తీసుకు రాబోతున్న అప్ కమింగ్ ఫోన్ విశేషాలు తెలుసుకుందాం.
Lava Blaze Duo 5G : లాంచ్
లావా బ్లేజ్ డ్యూవో స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లావా విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
Lava Blaze Duo 5G : ఫీచర్స్
లావా ఈ ఫోన్ ను డ్యూయల్ స్క్రీన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ తో పాటు 1.58 ఇంచ్ సెకండరీ AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ రెండవ స్క్రీన్ ఫోన్ వెనుక భాగంలో కెమెరా పక్కన ఉంటుంది. లావా ఇటీవల లాంచ్ చేసిన లావా అగ్ని 3 మాదిరిగా ఈ ఫోన్ లో కూడా రెండు స్క్రీన్లు ఉన్నాయి.
లావా ఈ ఫోన్ ను Mediatek Dimensity 7025 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ అందిస్తోంది. దీనికి జతగా 8GB LPDDR5 ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 64MP Sony ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా వుంది.
ఈ ఫోన్ ను ప్రీమియం మాట్టే ఫినిష్ డిజైన్ తో సెలెస్టియల్ బ్లూ మరియు ఆర్కిటిక్ వైట్ రెండు కలర్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా లావా కన్ఫర్మ్ చేసింది. ఇవి కాకుండా ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
Also Read: Realme 14X 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో లావా బ్లేజ్ సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ లను అందించిన లావా, ఇప్పుడు ఈ ఫోన్ ను కూడా ఊహించని ధరకు లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి.