64MP Sony సెన్సార్ ట్రిపుల్ కెమేరాతో వస్తున్న Lava Blaze Curve స్మార్ట్ ఫోన్.!

Updated on 27-Feb-2024
HIGHLIGHTS

లావా అప్ కమింగ్ స్మార్ ఫోన్ Lava Blaze Curve లాంఛ్ డేట్ అనౌన్స్

ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా లావా వెల్లడించింది

64MP Sony సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరాతో లాంఛ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది

ప్రముఖ భారతీయ మొబైల్ బ్రాండ్ లావా అప్ కమింగ్ స్మార్ ఫోన్ Lava Blaze Curve లాంఛ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను March 5 న మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ లాంఛ్ డేట్ ప్రకటనతో పాటుగా ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా లావా వెల్లడించింది. కొత్త అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పడిటికే ఈ ఫోన్ యొక్క డిస్ప్లే, ర్యామ్ మరియు ఇతర వివరాలను టీజర్ ల ద్వారా కంపెనీ బయట పెట్టింది.

Lava Blaze Curve

లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ లో గొప్ప సౌండ్ అందించగల డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కంపెనీ ఈరోజు అందించిన టీజర్ ద్వారా తెలిపింది. అంతేకాదు, ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇమ్మర్సివ్ సౌండ్ అందించే Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ అందిస్తున్నట్లు కూడా ఈ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను 64MP Sony సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరాతో లాంఛ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది.

ఇక ముందుగా అందించిన టీజర్ ద్వారా లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ప్రోసెసర్, ర్యామ్ మరియు స్టోరేజ్ వివరాలను వెల్లడించింది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR5 RAM మరియు UFS 3.1 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో తీసుకు వస్తున్నట్లు లావా చెబుతోంది.

Also Read: Nothing Phone (2a) కళ్ళు చెదిరే కొత్త డిజైన్ తో వస్తోంది.!

ఈ ఫోన్ లో 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED Curve డిస్ప్లే కూడా ఉన్నట్లు కంపెనీ ముందుగా అందించిన టీజర్ లో తెలిపింది. మొత్తంగా చూస్తే, ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్లతో వస్తున్నట్లు కచ్చితంగా తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు వచ్చే వరకూ మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :