Lava Blaze Curve Olution: లావా అప్ కమింగ్ కర్వ్డ్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఇండియన్ మార్కెట్ లో అతి తక్కువ ధరలో Curved డిస్ప్లేతో Agni 2 5జి ఫోన్ ను తీసుకు వచ్చిన లావా, ఇప్పుడు బ్లేజ్ సిరీస్ నుండి కూడా కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ యూ లాంఛ్ చేయబోతున్నట్లు తెలిపింది. వాస్తవానికి, లావా యొక్క బడ్జెట్ సిరీస్ గా కొనియాడబడుతున్న బ్లేజ్ సిరీస్ నుండి ఇప్పటికే మూడు ఫోన్ లు వచ్చాయి. ఈ మూడు ఫోన్లు కూడా కేవలం 10 రూపాయల ధర పరిధిలో వచ్చిన బడ్జెట్ 5G ఫోన్ లుగా నిలిచాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ నుండి కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ను లావా తీసుకు వస్తున్నట్లు చెబుతోంది.
లావా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Curve పేరుతో సూచిస్తోంది మరియు ఈ ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా లాంఛ్ చేస్తోంది. అందుకే, అమేజాన్ ఈ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి దాని ద్వారా టీజింగ్ స్టార్ట్ చేసింది. అయితే, ఈ పేజ్ నుండి ప్రస్తుతాని ఈ ఫోన్ యొక్క ఎటువంటి ఫీచర్లను కోడోత్ వెల్లడించ లేదు.
కానీ, లావా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియోలతో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలు అర్ధమవుతున్నాయి. లావా లేటెస్ట్ టీజర్ ట్వీట్ ద్వారా, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్, కర్వ్డ్ డిస్ప్లే మరియు వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ తో కనిపిస్తోంది.
Also Read: Oppo F25 Pro 5G: డిఫరెంట్ లుక్ మరియు స్టన్నింగ్ కెమేరా సెటప్ తో వస్తోంది.!
ఈ అప్ కమయింగ్ లావా ఫోన్ లో పంచ్ హోల్ డిజైన్ కలిగిన Curved డిస్ప్లే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ డిస్ప్లేని క్లియర్ గా చెప్పాలా చేసే ఇమేజ్ ను లావా బిజినెస్ హెడ్ మరియు ప్రెసిడెంట్ సునీల్ రైనా, ఈ ఫోన్ యొక్క డిజైన్ ను వివరిస్తూ టీజింగ్ ఇమేజ్ ను తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇందులో, లావా అప్ కమింగ్ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ గ్లాసీ డిజైన్ మరియు అట్రాక్టివ్ కర్వ్డ్ డిస్ప్లేతో కనిపిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. అయితే, ఈ ఫోన్ లాంఛ్ డేట్ మరియు కీలకమైన స్పెక్స్ ను త్వరలోనే ప్రకటిస్తుంది కావచ్చు.