LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ వంటి భారీ ఫీచర్స్ తో వస్తున్న Lava Blaze Curve.!

Updated on 01-Mar-2024
HIGHLIGHTS

Lava Blaze Curve భారీ ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది

5 March 2024 మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్య ద్వీప ఐల్యాడ్ నుండి లాంఛ్ అవుతుంది

LPDDR5 RAM మరియు UFS 3.1 వంటి భారీ ఫీచర్స్ తో తీసుకు వస్తోంది

లావా ఈసారి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Lava Blaze Curve భారీ ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంఛ్ కోసం చేస్తున్న టీజింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ప్రైస్ తప్ప దాదాపుగా అన్ని వివరాలను బయట పెట్టేసింది. ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకూ కంపెనీ బయట పెట్టిన వివరాల ప్రకారం LPDDR5 RAM మరియు UFS 3.1 వంటి భారీ ఫీచర్స్ తో వస్తున్నట్లు అర్ధమవుతోంది.

Lava Blaze Curve

లావా బ్లేజ్ కర్వ్ యొక్క డిజైన్, డిస్ప్లే, కెమేరా మరియు ర్యామ్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ వివరాల ద్వారా ఈ ఫోన్ సామర్ధ్యాన్ని అంచనా వేసేలా చేసింది. లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ 5 March 2024 మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్య ద్వీప్ ఐల్యాడ్ నుండి లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Lava Blaze Curve Launch

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED Curved డిస్ప్లేతో వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ లాంఛ్ కంటే ముందే తెలిపింది.

Also Read: రూ. 9,999 ధరకే Nokia G42 5G స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ లాంఛ్.!

LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్

ఈ ఫోన్ ను MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తోంది. అంతేకాదు, ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించే LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ లను ఈ ఫోన్ ఉపయోగించినట్లు లావా కన్ఫర్మ్ చేసింది. ఇది సాధారణ LPDDR4X కన్నా మరింత వేగంగా యాప్స్ ను ఓపెన్ చేస్తుందని కూడా తెలిపింది.

Lava Blaze Curve LPDDR5 RAM

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో 64MP Sony సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :