Lava Blaze Curve: గత కొంత కాలంగా దేశీయ ప్రముఖ మొబైల్ కంపెనీ లావా ఉరిస్తూ వస్తున్న కర్వ్డ్ 5జి మొబైల్ లావా బ్లేజ్ కర్వ్ ను ఈరోజు మార్కెట్ లో విడుదల చేసింది. ఈ మొబైల్ ఇప్పుడు అతి చవక ధరలో వచ్చిన కర్వ్డ్ 5జి మొబైల్ గా కూడా చరిత్ర కెక్కింది. ఇప్పటికే అన్ని మొబైల్ కంపెనీలు కూడా కర్వ్ ఫోన్ లను తీసుకురాగా, లావా ప్రవేశపెట్టిన ఈ ఫోన్ సరసమైన ఫోన్ గా నిలిచింది. అయితే, ఫోన్ లో ఫీచర్స్ మరియు స్పెక్స్ ను మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అందించడం విశేషం.
లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ కేవలం రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 8GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ఈ ధరం ధరను నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB మరియు 256GB రూ. 18,999 ధరతో లాంఛ్ చెయ్యబడింది.
11 March 2024 మధ్యాహ్నం 12 గంటల నుండి లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ Amazon నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది మరియు సేల్ కి ముందుగా నోటిఫై కొద చేసుకోవచ్చు.
Also Read: SONY Smart TV టీవీ పైన Flipkart బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత ఆకర్షణీయమైన గొప్ప 3D కర్వ్ డిజైన్ తో అందించింది. ఈ లావా కర్వ్ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ 3D Cuved AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో FHD+ రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR5 RAM + 8GB ప్యాండబుల్ RAM మరియు 256GB వరకూ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మూడింటి కలయికతో ఈ ఫోన్ మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.
ఈ ఫోన్ లో మంచి ఫీచర్స్ మరియు Sony సెన్సార్ కలిగిన కెమేరా సెటప్ తో అందించింది. ఈ బ్లేజ్ కర్వ్ ఫోన్ లో వెనుక 64MP ప్రైమరీ (Sony సెన్సార్) + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 4K/30fps వీడియోలను షూట్ చేయవచ్చని లావా తెలిపింది మరియు ముందు 32 MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
ఇంకా ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది మరియు 3 సంవత్సరాల అప్డేట్స్ ను 2మేజర్ OS అప్డేట్స్ (Android 14 & 15) లకు అప్డేట్ అవుతుందని కూడా కంపెనీ గ్యారంటీ ఇచ్చింది.