Lava Blaze Curve: అతి చవక ధరలో వచ్చిన కర్వ్డ్ 5జి మొబైల్ గా నిలిచింది.!
Lava Blaze Curve స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంఛ్ అయ్యింది
అతి చవక ధరలో వచ్చిన కర్వ్డ్ 5జి మొబైల్ గా కూడా చరిత్ర కెక్కింది
ఫోన్ లో ఫీచర్స్ మరియు స్పెక్స్ ను ఏ మాత్రం తగ్గకుండా అందించడం విశేషం
Lava Blaze Curve: గత కొంత కాలంగా దేశీయ ప్రముఖ మొబైల్ కంపెనీ లావా ఉరిస్తూ వస్తున్న కర్వ్డ్ 5జి మొబైల్ లావా బ్లేజ్ కర్వ్ ను ఈరోజు మార్కెట్ లో విడుదల చేసింది. ఈ మొబైల్ ఇప్పుడు అతి చవక ధరలో వచ్చిన కర్వ్డ్ 5జి మొబైల్ గా కూడా చరిత్ర కెక్కింది. ఇప్పటికే అన్ని మొబైల్ కంపెనీలు కూడా కర్వ్ ఫోన్ లను తీసుకురాగా, లావా ప్రవేశపెట్టిన ఈ ఫోన్ సరసమైన ఫోన్ గా నిలిచింది. అయితే, ఫోన్ లో ఫీచర్స్ మరియు స్పెక్స్ ను మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అందించడం విశేషం.
Lava Blaze Curve: Price
లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ కేవలం రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 8GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ఈ ధరం ధరను నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB మరియు 256GB రూ. 18,999 ధరతో లాంఛ్ చెయ్యబడింది.
11 March 2024 మధ్యాహ్నం 12 గంటల నుండి లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ Amazon నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది మరియు సేల్ కి ముందుగా నోటిఫై కొద చేసుకోవచ్చు.
Also Read: SONY Smart TV టీవీ పైన Flipkart బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Lava Blaze Curve: Specs
లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత ఆకర్షణీయమైన గొప్ప 3D కర్వ్ డిజైన్ తో అందించింది. ఈ లావా కర్వ్ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ 3D Cuved AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో FHD+ రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR5 RAM + 8GB ప్యాండబుల్ RAM మరియు 256GB వరకూ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మూడింటి కలయికతో ఈ ఫోన్ మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.
ఈ ఫోన్ లో మంచి ఫీచర్స్ మరియు Sony సెన్సార్ కలిగిన కెమేరా సెటప్ తో అందించింది. ఈ బ్లేజ్ కర్వ్ ఫోన్ లో వెనుక 64MP ప్రైమరీ (Sony సెన్సార్) + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 4K/30fps వీడియోలను షూట్ చేయవచ్చని లావా తెలిపింది మరియు ముందు 32 MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
ఇంకా ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది మరియు 3 సంవత్సరాల అప్డేట్స్ ను 2మేజర్ OS అప్డేట్స్ (Android 14 & 15) లకు అప్డేట్ అవుతుందని కూడా కంపెనీ గ్యారంటీ ఇచ్చింది.