Lava Blaze Curve: ప్రముఖ ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా, భారీ ఫీచర్ ఫీచర్లతో కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ గురించి గత కొంత కాలంగా టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఈరోజు కొత్త టీజర్ అప్డేట్ ను అందించింది. ఈ కొత్త టీజర్ అప్డేట్ నుండిఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను ప్రకటించింది. ఈ కొత్త టీజర్ వీడియో నుండి లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ స్పెక్స్ తో వస్తున్నట్లు అంచనా వేయవచ్చు.
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను వెల్లడించకుండానే కంపెనీ ఈ ఫోన్ పైన మరింత ఆశక్తి రేకెత్తించే టీజర్ లను విడుదల చేస్తోంది. ఈరోజు లావా అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి అందించిన టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను అందించింది. ముందుగా ఫోన్ డిజన్ మరియు కెమేరా సెటప్ ను వివరంగా తెలియచేసేల టీజింగ్ ఇమేజ్ లను అందించిన కంపెనీ, ఇప్పుడు, ప్రోసెసర్, డిస్ప్లే, RAM మరియు స్టోరేజ్ వివరాలతో వీడియో టీజర్ ను కూడా అందించింది.
Also Read: Voter ID Card పాత ఫోటో ప్లేస్ లో కొత్త ఫోటో అప్డేట్ చేసుకోవాలా.!
కొత్త టీజర్ లో టీజ్ చేసిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈరోజు లావా టీజర్ వీడియోలో ఈ ఫోన్ కొత్త అప్డేట్ లను అందించింది. ఇందులో, ఈ లావా అప్ కమింగ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పని చేస్తుందని కూడా తెలిపింది.
ఈ ఫాస్ట్ ప్రోసెసర్ కి మరింత ఎక్కువ వేగాన్ని అందించ గల 8GB LPDDR5 RAM ను ఈ ఫోన్ లో జత చేసినట్లు కూడా టీజర్ లో వివరించింది. అలాగే, ఈ ఫోన్ లో ఫాస్ట్ UFS 3.1 256 GB స్టోరేజ్ తో వస్తుందని కూడా చెప్పింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చాలా వేగంగా టీజర్ లను అందిస్తోంది. అంతేకాదు, కంపెనీ అందిస్తున్న టీజర్ ల ద్వారా ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది.