Lava Blaze 5G: IMC లో కొత్త 5G ఫోన్ ను లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

Lava కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది
IMC 2022 నుండి Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లాంచ్
లావా బ్లేజ్ 5G Dimensity 700 ప్రాసెసర్ తో పనిచేస్తుంది
IMC 2022 నుండి ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ Lava కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అదే, Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవలే ఇదే Blaze సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను వేనువెంటనే విడుదల చేసి సక్సస్ సాధించిన లావా, ఇప్పుడు 5G మొబైల్ ను కూడా విడుదల చేసింది. అయితే, వాస్తవానికి మొదటి 5G ఫోన్ లాంచ్ చేసిన చాలా కాలం తరువాత ఇప్పుడు రెండవ 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.
Lava Blaze 5G: స్పెక్స్
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది.
Lava Blaze 5G: ధర
వాస్తవానికి, ప్రస్తుతానికి ఈ లావా బ్లేజ్ 5G ఫోన్ ధర పైన క్లారిటీ లేదు. అయితే, ఈ ఫోన్ ను భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకొని వస్తోంది కాబట్టి, సుమారు 10,000 రూపాయల ధరలో ఈ ఫోన్ రేటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ దీపావళి పండుగ నాటికి Pre-Order లకు అందుబాటులో ఉంటుందని లావా ప్రకటించింది.