Lava Blaze 3 5G: భారీ ఫీచర్స్ తో 10 వేల బడ్జెట్ లో లాంచ్ అవుతోంది.!
Lava Blaze 3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ కంటే ఈ ఫోన్ Price అనౌన్స్ చేసింది
లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇప్పటికీ లావా ప్రకటించలేదు
ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్, ప్రైస్ మరియు ఫీచర్స్ ముందే ప్రకటించింది
Lava Blaze 3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ కంటే ఈ ఫోన్ ప్రైస్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజ్ మరియు కంపెనీ X (ట్విట్టర్) అకౌంట్ మరియు ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా ఎంచుకున్న అమెజాన్ ఇండియా నుంచి ఈ ఫోన్ ప్రైస్ వివరాలు బయటపెట్టింది. ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్, ప్రైస్ మరియు ఫీచర్స్ ముందే తెలుసుకోండి.
Lava Blaze 3 5G: ప్రైస్
లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇప్పటికీ లావా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ రేటును మాత్రం ఈ రోజు ప్రకటించింది. వాస్తవానికి, ఈ ఫోన్ ప్రైస్ తో టీజింగ్ స్పీడ్ పెంచింది లావా ఈ అప్ కమింగ్ ఫోన్ బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ ను స్పెషల్ లాంచ్ ఆఫర్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి రూ. 9,999 ధరకే లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Lava Blaze 3 5G: ఫీచర్స్
లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ మరియు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ తో తీసుకు వస్తుంది. ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది మరియు గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గోల్డ్ రెండు కలర్స్ లో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB వర్చువల్ ర్యామ్ తో పాటు 128GB ఫాస్ట్ UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా సెటప్ ను కూడా లావా బయట పెట్టింది. ఈ ఫోన్ ను 50MP మెయిన్ + 2MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో సరికొత్త Vibe Lite ను కూడా అందించింది. ఈ లైట్ తో గొప్ప లో లైట్ ఫోటోలు మరియు వైబ్ లైట్ వీడియో లను షూట్ చేసే వీలుంటుంది.
Also Read: Noise Halo 2: ఫంక్షనల్ రొటేటింగ్ డయల్ తో ఫస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన నోయిస్.!
ఈ ఫోన్ లో 6.56 HD+ రిజల్యూషన్ కలిగిన పంచ్ హోల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కలిగి వుంది. లావా బ్లేజ్ 3 5జి ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 14OS తో పని చేస్తుంది.