Lava Blaze 3 5G: కొత్త Vibe Light తో  వస్తున్న లావా అప్ కమింగ్ ఫోన్.!

Lava Blaze 3 5G: కొత్త Vibe Light తో  వస్తున్న లావా అప్ కమింగ్ ఫోన్.!
HIGHLIGHTS

లావా బ్లేజ్ 3 సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను కొత్త Vibe Light తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ ను మొదలు పెట్టింది

Lava Blaze 3 5G: లావా బ్లేజ్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది. అదే, లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కొత్త Vibe Light తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ ను మొదలు పెట్టింది.

Lava Blaze 3 5G : లాంచ్ 

లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుందని లావా ప్రకటించింది. ‘Coming Soon’ ట్యాగ్ తో ఈ ఫోన్ లాంచ్ టీజర్ ను అందించింది. లావా యొక్క అధికారిక x అకౌంట్ నుంచి ఈ ఫోన్ టీజర్ ను అందించింది. ఈ టీజర్ వీడియోలో ఈ ఫోన్ వివరాలు చూపించింది. 

Lava Blaze 3 5G: ఫీచర్స్

లావా ఈ అప్ కమింగ్ 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టం వుంది మరియు దీనికి జతగా వైబ్ లైట్ ను కూడా అందించింది. ఈ లైట్ చూడడానికి వివో యొక్క ఆరా లైట్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఇది చేసే పనులను బట్టి ఈ లైట్ ప్రత్యేకత అర్ధం అవుతుంది. ఈ ఫోన్ ను 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా తెలిపింది.

Lava Blaze 3 5G Launch

ప్రస్తుతానికి ఈ లైట్ గురించి జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చింది. ఇది చేసే పనులు త్వరలోనే తెలియ చేసే అవకాశం వుంది. ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియో లో అందించిన హింట్ తో ఈ వైబ్ లైట్ కలర్ చేంజ్ ఫీచర్ తో ఉంటుందని అనిపిస్తుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఇది కెమెరాతో ఫోటోలు మరియు వీడియోలు తీసేప్పుడు కొత్త రంగులు మరియు హంగులు అందించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read: భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతున్న Xiaomi లేటెస్ట్ QLED Smart Tv లు.!

ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్  లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ ను కూడా త్వరలోనే లావా అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo