11GB ర్యామ్ ఫీచర్ తో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా..!

11GB ర్యామ్ ఫీచర్ తో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా..!
HIGHLIGHTS

Lava Blaze 1X 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది

లావా బడ్జెట్ సిరీస్ నుండి వచ్చిన కొత్త 5G ఫోన్

11 GB ర్యామ్ ఫీచర్ తో వచ్చిన లావా కొత్త 5G ఫోన్

ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా మార్కెట్ లో మరొక 5G ఫోన్ ను బడ్జెట్ లావా సిరీస్ అయిన Lava Blaze Series నుండి లాంచ్ చేసింది. Lava Blaze 1X 5G పేరుతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చెయ్యబడిన ఈ స్మార్ట్ ఫోన్ ర్యామ్ మరియు వర్చువల్ ర్యామ్ తో కలిపి 11,GB ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ సరికొత్త లావా 5G మొబైల్ డిజైన్, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. 

Lava Blaze 1X 5G: ప్రత్యేకతలు

లావా ఈ Lava Blaze 1X 5G స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్ మరియు యూజర్లను దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే WIDEVINE L1 సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Dimensity 700 తో వచ్చింది. లావా ఈ ఫోన్ ను 6GB ర్యామ్ మరియు 5GB వరకూ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా యాడ్ చేసింది. 

ఈ స్మార్ట్ ఫోన్ లో EIS సపోర్ట్ తో 2K వీడియోలను రికార్డ్ చేయగల 50MP ట్రిపుల్ కెమేరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కెమేరా 50MP+2MP+VGA కెమేరా రియర్ కెమేరా సెటప్ ను మరియు ముందు 8MP షూటర్ ను అందుకుంది. ఈ ఫోన్ లో 15W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్లతో వస్తుంది మరియు Android 12OS పైన పని చేస్తుంది. 

Lava Blaze 1X 5G: ధర 

లావా ఈ Lava Blaze 1X 5G: స్మార్ట్ ఫోన్ ను ఐతే విడుదల చేసింది కానీ, ధర మరియు ఆఫర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించ లేదు. కానీ ఈ ఫోన్ లావా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరొందిన బ్లేజ్ నుండి వచ్చింది కాబట్టి 15 వేల కంటే తక్కువ ధరలో ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఇక్కడ సూచించిన ధర అంచనా ధర మాత్రమే అని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo