ఆండ్రాయిడ్ వన్ సిరిస్ లో రెండవ మోడల్
గూగల్ - lava పార్టనర్ షిప్ తో వస్తుంది.
గతంలో గూగల్ ఇండియన్ బ్రాండ్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆండ్రాయిడ్ వన్ పేరుతో కొన్ని మొబైల్స్ ను లాంచ్ చేసింది. ప్యూర్ ఆండ్రాయిడ్ os తో ఫ్యూచర్ అప్ డేట్స్ గేరంటీ తో మార్కెటింగ్ చేసినప్పటికీ ఆ సిరిస్ అంతగా సక్సెస్ కాలేదు. ఈ రోజు లావా ఆండ్రాయిడ్ one సిరిస్ లో గూగల్ తో పార్టనర్ షిప్ చేసి lava Pixel V1 మోడల్ ను లాంచ్ చేసింది. దీని ధర 11,350 రూ. ఫోన్ రిటైల్ స్టోర్స్ మరియు ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఆన్ లైన్ లో దొరకనుంది.
ఈ ఫోన్ రెండు సంవత్సరాలు పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ను సపోర్ట్ చేస్తుంది. Lava Pixel V1 స్పెక్స్ – 5.5 in HD IPS స్క్రీన్, 1.3GHz మీడియా టెక్ MT6582 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32 అదనపు స్టోరేజ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ 3G కనెక్టివిటి, 13MP LED బ్లూ గ్లాస్ ఫిల్టర్ రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, బ్లూటూత్ 4.0, 2650 mah బ్యాటరీ(optimised 90 మినిట్స్ ఎక్కువ బ్యాటరీ లైఫ్), USB OTG సపోర్ట్, మైక్రో usb, ఆండ్రాయిడ్ 5.1.1 ఉన్నాయి.
పేపర్ స్పెక్స్ ప్రకారం చుస్తే ఈ రేటు కి FHD డిస్ప్లే, ఆక్టో కోర్ ప్ర్రోసేసర్ మరియు 4G కనెక్టివిటి ఫీచర్స్ తో కొన్ని మొబైల్స్ available గా ఉన్నాయి. సో వీటి lack తో గూగల్ సర్టిఫైడ్ డివైజ్ అని ఆండ్రాయిడ్ వన్ సిరిస్ తో వచ్చిన మోడల్ అంచనాలను అందుకోలేదు అని చెప్పవచ్చా?