ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా కొత్త ఫోన్ గురించి ఆన్లైన్ భారీగానే చర్చ జరుగుతోంది. కేవలం 20 వేల రూపాయల ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో లావా అగ్ని 2 ఫోన్ ను లాంచ్ చేసిన లావా. ఇప్పుడు ఇదే సిరీస్ నుండి Lava Agni 2s ను కూడా లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. ఈ విషయం గురించి ఇప్పటికే నెట్టింట్లో రచ్చ జరుగుతోంది. ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ అంచనా స్పెక్స్ మొదలుకొని లాంచ్ వరకూ కొత్త విషయాలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
లావా అగ్ని 2ఎస్ స్మార్ట్ ఫోన్ అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో అడుగుపెడుతుందని కొత్త నివేదికలు బల్ల గుద్ది చెబుతున్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఈ నెల చివరిలో లేదా డిసెంబర్ నెలలో విడుదల కావచ్చని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే కొత్త సంవత్సర కానుకగా లావా ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే అవకాశం వుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ పరంగా ఇటీవల వచ్చిన లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ ను పోలి ఉంటుందని కూడా తెలుస్తోంది. అయితే, లావా అగ్ని 2s ఫోన్ ప్రోసెసర్ పరంగా మార్పు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే, త్వరలోనే లావా నుండి కొత్త ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : Google Photos కోసం New AI ఫీచర్ తీసుకు వచ్చిన గూగుల్ | Tech News
లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ 120Hz 3D Curved డిస్ప్లేని HDR10+ మరియు Widevine L1 సర్టిఫికేషన్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ DIMENSITY 7050 ప్రోసెసర్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ లో 8GB + 8GB వర్చువల్ RAM మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఫోన్ లో 50MP క్వాడ్ రియర్ కెమేరా సెటప్ ను 4K / 30fps వీడియో సపోర్ట్ తో కలిగి వుంది మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో 4700mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.