లావా అగ్ని నెక్స్ట్ సేల్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!

Updated on 12-Jun-2023
HIGHLIGHTS

లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ డేట్ వచ్చేసింది

లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ జూన్ 15 న జరుగుతుంది

8GB అదనపు ర్యామ్ ఫీచర్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో వుంది

లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చెయ్యడానికి ఎదురు చూస్తున్న వారి కోసం లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ ను కంపెనీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జూన్ 15 వ తేదీ ఈ స్మార్ట్ ఫోన్ మరొక సారి సేల్ కి అందుబాటులోకి రానున్నదని లావా అధికారిక ప్రకటన చేసింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ దేశీయ 5G స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ నుండి స్మార్ట్ ఫోన్ లు హాట్ హాట్ గా అవ్వడంతో కంపెనీ ఆనందం వ్యక్తం చేసింది.   

లావా అగ్ని2 స్మార్ట్ ఫోన్ రూ.21,999 ధరతో సేల్ అవుతోంది. ప్రారంభంలో ఈ ఫోన్ పైన 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ద్వారా రూ. 19,999 ధరకే అందుకునే అవకాశం అందించింది. అయితే, ప్రస్తుతం బ్యాంక్ అఫర్స్ ను ఈ ఫోన్ తో జత చేయనట్లు కనిపిస్తోంది.    
అయితే, ఈ ఫోన్ పైన అందించిన 1Year Free Replacement అఫర్ ఈ ఫోన్ కొనుగోలుకు యూజర్లను ఆకర్షిస్తున్న బెస్ట్ అఫర్ గా మాత్రం చెబుతున్నారు. 

లావా అగ్ని2: ప్రధాన ఆకర్షణలు 

ఈ కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో బిగ్ Curved Display మరియు వేగవంతమైన మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 7050 SoC తో వచ్చిన ఫోన్ గా లావా అగ్ని 2 నిలుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఫోన్ మరింత వేగంగా ఉండడానికి వీలుగా 8GB ర్యామ్ జతగా 8GB అదనపు ర్యామ్ ఫీచర్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో వుంది.

ఈ ఫోన్ 4K వీడియో (30fps) రికార్డ్ చెయ్యగల 50MP క్వాడ్ కెమేరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్లీన్ ఆండ్రాయిడ్ 13OS వంటి ప్రధాన ఆకర్షణలు ఈ ఫోన్ సొంతం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :