ఇండియన్ బ్రాండ్ లావా ఇండియాలో ఇటీవల విడుదల చేసిన Curved Display బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Lava Agni 2 ఈరోజు మొదటి సారి సేల్ కి వచ్చింది. అయితే, ఈరోజు ఉదయం 10 గంటలకి మొదలైన సేల్ నిముషాల్లోనే ముగిసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్టాక్ అయిపోవడంతో సేల్ ముగిసినట్లు కంపెనీ తెలిపింది. కానీ ఈ ఫోన్ యొక్క ఎన్ని యూనిట్లు సేల్ అయ్యాయో అనే విషయాన్ని మాత్రం లావా తెలియపరచ లేదు.
Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ఇటీవల ఇండియాలో కర్వ్డ్ డిస్ప్లే ఫాస్ట్ 5G ప్రోసెసర్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో ఇటీవల లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ ఫోన్ మొదటి సేల్ మొదలైన గంటకే ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంది.
ఈ ట్వీట్ నుండి 'Thank You India' we are out of stock అని తెలిపింది. అంతేకాదు, త్వరలోనే ఈ ఫోన్ స్టాక్ అంధుబౌట్లోకి తీసుకు వస్తుందని కూడా ఈ ట్వీట్ లో తేలిపింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
https://twitter.com/LavaMobile/status/1661248718488899584?ref_src=twsrc%5Etfw
ఈ ట్వీట్ కు స్పందిస్తూ ఈ ఫోన్ కొన్న వారు వారి ఆర్డర్ స్క్రీన్ షాట్ లను పంచుకోగా, ఫోన్ కొనడానికి ఎదురు చూసి వెనుదిరిగిన వారు వారు విచారాన్ని వ్యక్తం చెశారు.
వాస్తవానికి, ఈ ఫోన్ గురించి సేల్ ముందు నుండే మంచి హైప్ సంపాదించుకుంది. ఇందుకు కారణం, ఈ ఫోన్ 20 వేల రూపాయల ఉప ధరలో Curved Display, 50MP క్వాడ్ కెమేరా సిస్టమ్, లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అన్ని వివరాలను కలిగి ఉండడం మరియు ఫోన్ పాడైతే (హార్డ్ వేర్ ప్రాబ్లమ్ వస్తే) కొత్త ఫోన్ ఇస్తాననడం కూడా హైప్ కి కారణం కావచ్చని చెబుతున్నారు.