చైనా ఫోన్లకు దీటైన పోటీగా తక్కువ ధరలో వచ్చిన ఇండియన్ బ్రాండ్ 5G ఫోన్.!

చైనా ఫోన్లకు దీటైన పోటీగా తక్కువ ధరలో వచ్చిన ఇండియన్ బ్రాండ్ 5G ఫోన్.!
HIGHLIGHTS

Lava ఈసారి చైనా కంపెనీలకు ఊహించని షాక్ ఇచ్చింది

అతి తక్కువ ధరలో Curved Display స్మార్ట్ ఫోన్ లాంచ్

Lava Agni 2 5G చావా ధరలో భారీ ఫీచర్లతో వచ్చింది

స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ Lava ఈసారి చైనా కంపెనీలకు ఊహించని షాక్ ఇచ్చింది. అతి తక్కువ ధరలో Curved Display, బెస్ట్ కెమేరా సెటప్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి ప్రస్తుతం మార్కెట్ బెస్ట్ ట్రెండ్ ఫీచర్లతో Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు మరియు డిజైన్ పరంగా ప్రీమియం ఫోన్ ను తలపించిన ఈ ఫోన్ రెట్ ను మాత్రం 20 వేల రూపాయల సెగ్మెంట్ లో ఉంచి లావా అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ లేటెస్ట్ దేశీ 5G స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Lava Agni 2 5G: ధర & ఆఫర్లు 

లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను 8GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ తో కంపెనీ రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ స్పెషల్ అఫర్ ధరలో భాగంగా ఈ ఫోన్ ను రూ.19,999 రేటుకె అఫర్ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే, ఇది బ్యాంక్ అఫర్ తో ఈ రేట్ ను అఫర్ చేస్తునట్లు తెలుస్తోంది.

ఆపైన తెలిపిన స్పెషల్ ఆఫర్ ధర బ్యాంక్ అఫర్ తో లభిస్తుంది. ఎందుకంటే, లావా ఈ ఫోన్ పైన అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 డిస్కౌంట్ ను అఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ను మీరు ఈరోజు నుండి అమెజాన్ నుండి Register చేసుకోవచ్చు మరియు ఫోన్ మే 24 నుండి అమెజాన్ నుండి సేల్ అవుతుంది.

Lava Agni 2 5G: ప్రత్యేకతలు 

లావా అగ్ని 2 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ Curved AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్, 950 నిట్స్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి వుంది. ఈ ఫోన్ 3D డ్యూయల్ కర్వ్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా మరియు ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 5G ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఇండియాలో ఈ ప్రోసెసర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, మొత్తం 16GB ర్యామ్ సపోర్ట్ ఈ ఫోన్ తో అందుకోవచ్చు మరియు జతగా 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది. ఈ లావా ఫోన్ లేటెస్ట్ Clean Android 13 OS పైన పని చేస్తుంది మరియు ఈ ఫోన్ Android 14 మరియు 15 OS అప్డేట్ లను అందుకుంటుందని కూడా లావా తెలిపింది.

 

 

ఈ ఫోన్ కెమేరాల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన కెమేరా కలిగిన క్వాడ్ కెమేరా ని కలిగి వుంది. ఈ అగ్ని 2 5G ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4700mAh బ్యాటరీతో వచ్చింది. 

ముఖ్యంగా, ఈ ఫోన్ పైన లావా అందించిన Free Phone Replacement ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ లో ఏదైనా హార్డ్ వేర్ ప్రాబ్లమ్ సంభవించినట్లయితే 1st Time పూర్తిగా హ్యాండ్ సెట్ ను రీప్లేస్ చేయనున్నట్లు లావా తెలిపింది. అంతేకాదు, దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లే పని లేకుండా  ఇంటి వద్దకే ఉచిత సర్వీస్ అందిస్తాము, అని లావా పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo