భారతీయ Curved డిస్ప్లే ఫోన్ Agni 2 5G సేల్ మళ్ళీ నిముషాల్లో క్లోజ్.!
Agni 2 5G సేల్ మళ్ళీ నిముషాల్లో క్లోజ్ అయినట్లు ప్రకటించింది
లావా అగ్ని 2 ఫోన్ మే 24 న మొదటి సారిగా సేల్ కి వచ్చింది
ఈరోజు జరిగిన రెండవ సేల్ నుండి కూడా అదే పరిస్థితి నెలకొంది
భారతీయ Curved డిస్ప్లే ఫోన్ Agni 2 5G సేల్ మళ్ళీ నిముషాల్లో క్లోజ్ అయినట్లు ప్రకటించింది. ప్రముఖ భారతీయ మొబైల్ కంపెనీ లావా ఇటీవల Curced Display మరియు మరిన్ని ఫీచర్లతో 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ నుండి ఫోన్లు నిముషాల్లో అమ్ముడైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కోసం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి లావా నిర్వహించిన మరొక సేల్ నుండి కూడా ఈ ఫోన్ నిముషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడైనట్లు ప్రకటించారు.
Lava Agni 2 5G: సేల్
లావా అగ్ని 2 ఫోన్ మే 24 న మొదటి సారిగా సేల్ కి వచ్చింది. అయితే, సేల్ స్టార్ట్ అయిన నిముషాల్లోనే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టేసింది. అయితే, కంపెనీ ఈ విషయం పై స్పందిస్తూ రెండవ సేల్ ను మే 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహిస్తునట్లు అనౌన్స్ చేసింది. అయితే. ఈరోజు జరిగిన రెండవ సేల్ నుండి కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ ఫోన్ సేల్ మొదలైన నిముషాల్లోనే 'currently not available' అని తెలిపింది. అమెజాన్ నుండి 12 మద్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ సేల్ నిముషాల వ్యవధిలో ఈ నోటిఫికేషన్ ను సూచించింది.
ఈ విషయం పైన లావా మొబైల్ ప్రసిడెంట్ మరియు బిజినెస్ హెడ్ అయిన సునీల్ రైనా స్పందిస్తూ, "ఈరోజు కూడా #Agni2 నిముషాల్లోనే పూర్తిగా అమ్మడుయ్యాయి. మాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు" అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు.
1/3
Today again #Agni2 was sold out in minutes. Thank you for your support
I apologise to all those who could not get it in this sale.
We have realised that even though we had estimated heavy demand but the actual demand has far exceeded our estimates. We are overwhelmed!— Sunil Raina (@reachraina) May 31, 2023
20 వేల బడ్జెట్ ధరలో Curved AMOLED డిస్ప్లే, 50MP క్వాడ్ కెమేరా, మీడియాటెక్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 7050, 256 GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్, 66W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన హెవీ బ్యాటరీ వంటి ఆకర్షణనీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.
ఈ ఫోన్ లో ఏదైనా మానిఫ్యాక్చరింగ్ డిఫెక్స్ ఉంటే, కొత్త ఫోన్ ను ఉచితంగా రీప్లేస్ మెంట్ చేస్తామని, కంపెనీ గ్యారెంటీ ఇవ్వడం కూడా ఈ ఫోన్ పైన హైప్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.