ఇండియన్ మొబైల్ బ్రాండ్ Lava ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన బడ్జెట్ Curve Display 5G ఫోన్ Agni 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్ చేసింది. మే 24 న ఉదయం 10 గంటలకు మొదలైన ఫస్ట్ సేల్ కేవలం గంటలోనే ముగిసింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి వెల్లడించింది. అయితే, అప్పటి నుండి నెక్స్ట్ సేల్ యెప్పుడ్డు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఈ నెక్స్ట్ సేల్ డేట్ అనౌన్స్ చేసి ఖుషి చేసింది.
లావా అగ్ని నెక్స్ట్ సేల్ నుండి మే 31 వ తేదీ మధ్యాహ్నం నిర్వహిస్తుట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఫోన్ రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి వస్తుందిని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ రూ. 21,999 ధరతో ,లిస్టింగ్ చెయ్యబడింది మరియు బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 19,999 అఫర్ ధరకే అందుకునే వీలుంది.
https://twitter.com/LavaMobile/status/1662803508297383937?ref_src=twsrc%5Etfw
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా కేవలం 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లోనే Curved Display తో అందించడం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు ఈ బడ్జెట్ Dimensity 7050 ఫాస్ట్ ప్రోసెసర్ మరియు 256 GB హెవీ 8 GB ర్యామ్ కి జతగా 8GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను అందించడం కూడా కారణాలుగా చెప్పవచ్చు.
ఇవన్నీ ఒక ఎత్తైతే, లావా ఈ ఫోన్ పైన అందించిన 'Free Phone Replacement' ఒక ఎత్తని చెప్పాలి. అంటే, ఈ ఫోన్ లో ఏదైనా టెక్నీకల్ సమస్యలు తెలెత్తితే కొత్త ఫోన్ ను రీప్లేస్ చేస్తానని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ లతో ఈ ఫోన్ పైన హైప్ ను మరింతగా పెంచేసింది.
మరి మే 31 న మరొకసారి సేల్ కి వస్తున్నా ఈ ఫోన్ అమ్మకాలు ఈసారి ఎలా ఉంటాయో చూడాలి.