చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన అగ్ని 2 5G ఫస్ట్ సేల్.!

Updated on 23-May-2023
HIGHLIGHTS

అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది

లావా అగ్ని 2 కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో వచ్చింది

Rs. 2,000 రూపాయల డిస్కౌంట్ అఫర్ అందుకోవచ్చు

చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో లావా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మంచి హైప్ ను సంపాదించుకుంది. ఈ ఫోన్ వారెంటీలో భాగంగా లావా తెలిపిన ఫోన్ రీప్లేస్మెంట్ అఫర్, భారతీయ యూజర్లను ఆకట్టుకుంటోదని కూడా చెబుతున్నారు. రేపు మొదటి సరిగా అమ్మకాలను కొనసాగించనున్న ఈ లావా బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అగ్ని 2 5G వివరాల పైన ఒక లుక్కేయండి. 

లావా అగ్ని 2: ధర మరియు ఆఫర్లు

లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా రూ. 21,999 రేటుతో లాంచ్ చేసింది. అయితే, లంచ్ ఆఫర్ లో భాగంగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ల న ఈ ఫోన్ పైన అందించింది. అంటే, ఈ లావా ఫోన్ ను ప్రధాన బ్యాంక్స్ కార్డ్స్ ను ఉపయోగించి కొనే వారికి 2,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 

లావా అగ్ని 2 రేపు ఉదయం 10 గంటల నుండి అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

లావా అగ్ని 2: ప్రత్యేకతలు

లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి ఫోన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో FHD+ రిజల్యూషన్ కలిగిన Curved AMOLED (6.78 ఇంచ్) డిస్ప్లేతో ఉంటుంది.  ఇది HDR 10+ సర్టిఫికేషన్ మరియు ఓలియోఫోబిక్ కోటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా కనిపిస్తుంది మరియు 3D డ్యూయల్ కర్వ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. 

ఈ ఫోన్ లో మీరు 8GB ర్యామ్ ని 8GB వర్చువల్ ర్యామ్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సెటప్ 50MP మైన్ కెమేరా సెటప్ తో కలిగి వుంది. లావా ఈ లేటెస్ట్ ఫోన్ లో వేగవంతమైన 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :