ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక మొబైల్ తయారీ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తుంటాయి. అయితే, వాటిలో భారీ 24GB RAM తో వచ్చిన ఈ Latest Smartphones గురించి మీకు తెలుసా. ఫోన్ పెర్ఫార్మెన్స్ లో కీలక పాత్ర వహించే RAM ను బేస్ చేసుకొని కొన్ని మొబైల్ బ్రాండ్స్ తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను హెవీ 24GB RAM తో Lunch చేసాయి. అందుకే, ఈరోజు భారీ 24GB RAM తో వచ్చిన Latest Smartphones గురించి తెలుసుకుందాం పదండి.
24GB RAM తో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన బ్రాండ్ లలో Realme మరియు OnePlus ఉన్నాయి. అయితే, ఈ రెండు బ్రాండ్స్ కూడా చైనా మార్కెట్ లో ఈ ఫోన్లను విడుదల చేశాయి. వన్ ప్లస్ బ్రాండ్ నుండి OnePlus ACE 2 Pro ను 24GB RAM తో చైనాలో విడుదల చెయ్యగా, రియల్ మి బ్రాండ్ Realme GT 5 స్మార్ట్ ఫోన్ 24 24GB RAM తో చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలను క్రింద చూడవచ్చు.
రియల్ మి రీసెంట్ గా చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.74 ఇంచ్ Pro-XDR డిస్ప్లేని కలిగి వుంది. ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ఫాస్ట్ ప్రోసెసర్ కి జతగా హెవీ 24GB RAM మరియు 1TB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 50MP (Sony IMX 890 OIS) + 8MP సూపర్ వైడ్ యాంగిల్ + 2MP Macro సెన్సార్లు కలిగిన ట్రిపుల్ కెమేరా వుంది. Awakening Aura System Pro అనే అందమైన పవర్ ఫుల్ RGB లైట్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 240W ఫాస్ట్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీని తో వచ్చింది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ఇప్పటి వరకూ కంపెనీ ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.
Realme GT 5 కంటే ముందే వన్ ప్లస్ ఈ OnePlus ACE 2 Pro ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ వన్ ప్లస్ ఈ ACE 2 Pro ను వర్షంలో కూడా యాక్యురేట్ గా పనిచేసే Rain Water Touch Tech కలిగిన డిస్ప్లేతో లాంచ్ చేసింది. ACE 2 Pro స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ కి జతగా 24GB LPDDR5X RAM మరియు హెవీ 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 3D AMOLED డిస్ప్లే, 50MP Sony IMX890 ప్రధాన కెమేరా కలిగి 8K వీడియోలను చిత్రీకరించ గల సూపర్ కెమేరా కూడా ఉన్నాయి. OnePlus ACE 2 Pro ఫోన్ 150W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది.