ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన కొత్త స్మార్ట్ ఫోన్లలో కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో Curved Display తో వచ్చిన స్మార్ట్ ఫోన్ ల గురించి ఈరోజు మాట్లాడుకోనున్నాము. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకూ కేవలం ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కనిపించే ఈ కర్వ్డ్ డిస్ప్లే, ఇప్పుడు బడ్జెట్ యూజర్లకు కూడా చేరువయ్యింది. ఇది మాత్రమే కాదు బిగ్ కెమేరా సెటప్ కూడా ఈ ఫోన్లలో చూడవచ్చు.
ఇండియన్ మొబైల్ బ్రాండ్ కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ లో తీసుకువచ్చిన Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ఈ కేటగిరిలో ముందుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Curved AMOLED డిస్ప్లే తో అతి తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ లో 50MP బిగ్ క్వాడ్ కెమేరా, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
మోటోరోలా ఇటీవల ఇండియాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కూడా బడ్జెట్ ధరలో వచ్చిన కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ గా నిలిచింది. ఈ స్మార్ట్ ఫోన్ 3D Curved డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 8020 చిప్ సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ మరియు వెనుక 50MP (OIS)డ్యూయల్ కెమేరా సెటప్ ను మరియు 68W వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ టెక్ సపోర్ట్ కలిగి వుంది.
నిన్ననే ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కూడా బడ్జెట్ ధరలో Curved Display తో వచ్చిన స్మార్ట్ ఫోన్ ల లిస్ట్ లో నిలిచింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.23,999 రూపాయల ప్రారంభ ధరలో కర్వ్డ్ డిస్ప్లే, 100MP OIS ట్రిపుల్ కెమేరా, 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు Dimensity 7050 SoC వంటి ఫీచర్లతో వచ్చింది.