రూ. 7,999 చవక ధరకే వచ్చిన POCO C75 5G స్మార్ట్ ఫోన్ సేల్ మొదలయ్యింది.!

Updated on 19-Dec-2024
HIGHLIGHTS

POCO C75 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ కేవలం రూ. 7,999 ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి వుంది

పోకో సి75 స్మార్ట్ ఫోన్ Snapdragon 4s Gen 2 5G చిప్ సెట్ తో పని చేస్తుంది

ఇండియన్ మార్కెట్లో చాలా చవక ధరలో వచ్చిన POCO C75 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కేవలం రూ. 7,999 ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ కొనే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాను.

POCO C75 5G : ధర

పోకో ఈ బడ్జెట్ 5జి ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకే అందించింది. ఈ ఫోన్ ను Flipkart నుంచి Pay Later EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 రూపాయల వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 7,499 రూపాయలకు అందుకునే అవకాశం వుంది. అంతేకాదు, Flipkart Axis Bank Credit Card ఆప్షన్ పై కూడా 5% లభిస్తుంది.

Also Read: JioTag Go: గూగుల్ ఫైండ్ మై డివైజ్ సపోర్ట్ తో GPS ట్రాకర్ లాంచ్ చేసిన జియో.!

POCO C75 5G : ఫీచర్స్

పోకో సి75 స్మార్ట్ ఫోన్ Snapdragon 4s Gen 2 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ ను 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు మెమెరీ ఎక్స్ ప్యాండ్ చేసే ఆప్షన్ తో అందించింది. ఈ ఫోన్ Android 14 OS పై HyperOS సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 6.88 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది.

ఈ పోకో కొత్త ఫోన్ C75 5G లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ మరియు మరొక డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5160 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఆకట్టుకునే సన్నని డిజైన్ మరియు మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

ఈ ఫోన్ స్పీక్స్ షీట్ ప్రకారం, 8 వేల బడ్జెట్ లో మంచి ఫీచర్స్ కలిగి వుంది. అది కూడా అందమైన స్లీక్ మరియు ఎట్రాక్టివ్ డిజైన్ తో సహా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :