మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘Flexpai’ విశేషాల గురించి తెలుసుకోండి!

Updated on 07-Nov-2018
HIGHLIGHTS

మధ్యకి మడిచిపెట్టేలా ఈ ఫోన్ ని తయారుచేసింది మరియు ఇది చైనాలో అందుబాటులోవుంది.

గతకొన్ని రోజులుగా,  మడిచిపెట్టే ఫోన్ల గురించిన పుకార్లు మరియు వార్తలు చాలానే  వెలువడుతున్నాయి.  LG,Samsung మరియు Apple వంటి పెద్ద పెద్ద కంపెనీలు గత కొద్దీ నెలలుగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తయారీ గురించిన అప్డేట్స్ చేస్తూవచ్చాయి. కానీ, ఇప్పుడు ఆశ్చర్యంగా కాలిఫోర్నియా ఆధారిత కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ ని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసింది, అదే FlexPai మరియు ఇది చైనాలో అందుబాటులోకి వచ్చింది కూడా.        

ఈ ఫోన్ తయారీదారైన, ప్రసిద్ధ చైనీస్ తయారీదారు Royole కార్పొరేషన్ ఈ FlexPai ఫోన్యొక్క ఫోల్డింగ్ పనితనం చాల మన్నికైనదని తెలిపింది.  ఈ ఫోన్ ఒక 4: 3,16:9 మరియు 18:9 వంటి వివిధ రేషియోలు కలిగిన  ఒక 7.8 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. అలాగే, 1920 x 1440 డిస్ప్లే  పూర్తిగా టాబ్లెట్కు సరిపోయేలా ఫ్లాట్ చేయబడింది.

ఈ ఫోన్ను మధ్యకు ముడుచుకోవచ్చు, FlexPai ప్రధాన చిప్సెట్ మరియు అధిక ర్యామ్ తో వస్తుంది మరియు ఇది 326 గ్రాములతో కొంచెం బరువుగా ఉంటుంది. అలాగే ఇది 256GB స్టోరేజి, మెమోరికార్డుతో దీని సామర్ఢ్యన్ని పెంచుకునే వీలుంటుంది.  ఈ FlexPai ఆన్లైన్లో అమ్మకానికి  సిద్ధంగా ఉందని నివేదించబడింది మరియు ఈ ఏడాది డిసెంబరులో, ఈ ఫోన్ యొక్క అమ్మకాలు జరపనుంది. Royol కార్పొరేషన్ యొక్క FlexPai CNY 12,999 (రూ 137000) మరియు ప్రారంభస్థాయి వేరియంట్ ఈ CNY 8.999 నుండి మరొక వెర్షన్ అందుబాటులో ఉంది ఇది (సుమారు రూ 95,000) ఈ FlexPai ఫోన్ భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ త్వరలోనే  అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :