జియో ఫోన్ 3 ఒక 5 అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లే, 2GB ర్యామ్ మరియు ధర కేవలం రూ. 4500
ఈ ఫోన్ జూన్ 2019 లో రానున్నట్లు అంచనావేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఈ ఫోన్ 2GB ర్యామ్ 64GB స్టోరేజితో రానున్నట్లు ఒక జియో ఎగ్జిక్కుటివ్ తెలిపారు.
జియో టెలికం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే, తన అధితమైన ఆఫర్లు మరియు నెట్వర్కుతో అందరిని షాక్ కు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే. అంతటితో ఆగకుండా తన జియో ఫోన్ విడుదల చేసి చాల తక్కువ ధరలో 4G అందరికి అందుబాటులోకి తెచ్చితన సత్తా చాటుకుంది. ఆతరువాత, QWERTY కీబోర్డుతో ఒక ఫిచారు ఫోన్ను అతితక్కువ ధరతో తీసుకొచ్చి మరొకసారి తనకు ఎవరు సాటిరారని తెలియచేసింది. ప్రస్తుతం, కొన్ని రిపోర్టుల ప్రకారంగా చూస్తుంటే, ఈ సంవత్సరం జూన్ నెలలో ఒక పెద్ద టచ్చ్ స్క్రీన్ తో కూడిన ఒక ఫోన్ను, జియోఫోన్ 3 గా మార్కెట్లోకి తీసుకురాబోతున్నదని తెలుస్తోంది.
జియో ఫోన్3 స్పెసిఫికేషన్స్ (రూమర్లలో ఉన్న స్పెక్స్)
ఒక అనామక జియో ఎగ్జిక్కుటివ్ తెలిపిన ప్రకారం, ఈ సంస్థ జియో ఫోన్ను ఒక 5- అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లేతో ప్రకటించనున్నదని తెలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు చెప్పబడుతోంది. ఇక్కడ చెప్పినదంతా నిజంగా జరిగితే, ముందుగా వచ్చిన 2.4 ఇంచ్ స్క్రీన్ మరియు 4GB స్టోరేజి నుండి ఒక్కసరిగా గణనీయమైన మార్పుకు జియో జంప్ చేయనున్నట్లు చెప్పుకోవచ్చు. అలాగే, ముందుగా వచ్చిన జియో ఫోన్ల వలెనే మెమోరిని పెంచుకునేవేలును కూడా కల్పిస్తుందని అంచనావేయవచ్చు.
ఇక కెమేరాల పరంగా కూడా ఇది బాగానే ఉండవచ్చని అర్ధమవుతుంది. ఇది ఒక 5MP వెనుక కెమెరా మరియు ముందు 2MP సెల్ఫీ కెమేరాతో తో ఉండవచ్చు. అయితే, దీని OS గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, KaiOS పూర్తి ప్రధాన వెర్షన్ లేదా గూగుల్ యొక్క తేలిక పాటి వెర్షన్ అయినటువంటి Android Go OS ఉండవచ్చని అంచనావేస్తున్నారు.
జియోఫోన్ 3 అంచనా ధర మరియు అందుబాటు
ఈ నివేదిక ప్రకారం, ఒకవేళ ఈ జియోఫోన్ పైన తెలిపిన అప్డేట్స్ తో కనుక వచ్చినట్లయితే, ఇది 1500 మరియు 2999 ధరలతో వరుసగా విడుదలైనటువంటి జియోఫోన్ మరియు జియోఫోన్2 కంటే ఎక్కువ ధరతో ఉండవచ్చు. ఈ జియోఫోన్3 రూ.4,500 ధరతో ఉండవచ్చని అంచనా మరియు ముందు ఫోన్లా మాదిరిగానే ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.
ఇక లాంచ్ డేట్ విషయానికి వస్తే, ఈ జియోఫోన్3 అధికారికంగా జూన్ నెలలో ప్రీ ఆర్డర్ల కోసం రావచ్చని, వీటి యొక్క సేల్ ఆగష్టు నుండి ప్రారంభంకావచ్చని అంచనాలను ఈ రిపోర్ట్ తెలిపింది.